Share News

ORR: ఔటర్‌ అండర్‌పాస్‏లో నిఘా.. రూ.7.54కోట్లతో త్వరలోనే సీసీ కెమెరాల ఏర్పాటు

ABN , Publish Date - Oct 24 , 2025 | 07:20 AM

ఔటర్‌ రింగ్‌ రోడ్డు అండర్‌పాస్‏ల్లో నిఘాను ప్రభుత్వం మరింత పటిష్ఠం చేయనుంది. ఇప్పటికే విద్యుద్దీపాలు ఏర్పాటు చేసిన హెచ్‌ఎండీఏ.. ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది. తొలుత సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని 66 అండర్‌పాస్ ల్లో రూ.7.54కోట్ల వ్యయంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనుంది.

ORR: ఔటర్‌ అండర్‌పాస్‏లో నిఘా.. రూ.7.54కోట్లతో త్వరలోనే సీసీ కెమెరాల ఏర్పాటు

హైదరాబాద్‌ సిటీ: ఔటర్‌ రింగ్‌ రోడ్డు అండర్‌పాస్‏ల్లో నిఘాను ప్రభుత్వం మరింత పటిష్ఠం చేయనుంది. ఇప్పటికే విద్యుద్దీపాలు ఏర్పాటు చేసిన హెచ్‌ఎండీఏ.. ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది. తొలుత సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని 66 అండర్‌పాస్ ల్లో రూ.7.54కోట్ల వ్యయంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు టెండర్లను కూడా ఆహ్వానించారు. ఆ తర్వాత ఔటర్‌ అండర్‌పాస్ ల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు.


city2.2.jpg

మరో విడుతలో ఔటర్‌ ఇంటర్‌ ఛేంజ్‌ల్లో, రాచకొండ పోలీసు కమిషనరేట్‌(Rachakonda Police Commissionerate) పరిధిలోని ఔటర్‌ అండర్‌పాస్‏ల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ఔటర్‌ అండర్‌పాస్‏లు నేరాలకు అడ్డాగా మారుతున్నాయి. దేశంలోనే సంచలనం సృష్టించిన ‘దిశ’ ఘటన ఔటర్‌ అండర్‌పా్‌సలోనే కావడం గమనార్హం. నిఘా లేకపోవడంతో నేరాలు, ఘోరాలు అండర్‌ పాస్‌లలో నిత్యకృత్యమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఔటర్‌ అండర్‌పాస్‏ల్లో విద్యుద్దీపాలు ఏర్పాటు చేసినా, ఓవైపు పోలీసులు, మరో వైపు ఔటర్‌కు సంబంధించిన పెట్రోలింగ్‌ వాహనాలు తిరుగుతున్నా కానీ నేరాలు తగ్గడం లేదు.


city2.3.jpg

దీంతో సైబరాబాద్‌ పోలీసులు పూర్తిస్థాయిలో సర్వే చేసి హెచ్‌ఎండీఏకు నివేదిక అందిస్తూ సైబరాబాద్‌ పరిధిలోని దాదాపు 66 అండర్‌ పాస్ ల్లో సత్వరమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో రూ.7.54కోట్ల వ్యయంతో 66 అండర్‌పాస్‏ల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడానికి ఇటీవల టెండర్లను ఆహ్వానించారు. ఈ సీసీ కెమెరాలను ఆరు నెలల్లోనే అన్ని ప్రాంతాల్లో అమర్చాలని, పూర్తిగా పోలీసు కమిషనరేట్‌కు అనుసంధానం చేయాలని సూచించారు. దీంతో ఔటర్‌ రింగ్‌ రోడ్డు కూడా పూర్తిస్థాయి నిఘాలోకి వెళ్లనుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

మద్యం దరఖాస్తులతో 2,863 కోట్ల ఆదాయం

విమానాల్లో పవర్‌ బ్యాంకులపై నిషేధం

Read Latest Telangana News and National News

Updated Date - Oct 24 , 2025 | 07:20 AM