Share News

Hyderabad: అవయవదానం.. మరో నలుగురికి ప్రాణదానం

ABN , Publish Date - Jun 24 , 2025 | 09:54 AM

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి బ్రెయిన్‌ డెడ్‌ అయింది. దీంతో కుటుంబసభ్యులు అవయవదానం చేశారు. జీవన్‌దాన్‌ వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలనగర్‌, తిరుమలగిరి రాజుకాలనీకి చెందిన పిల్లి శ్యామ్‌బాబు(51) స్థానికంగా పాన్‌షాప్ నిర్వహిస్తున్నాడు.

Hyderabad: అవయవదానం.. మరో నలుగురికి ప్రాణదానం

హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి బ్రెయిన్‌ డెడ్‌ అయింది. దీంతో కుటుంబసభ్యులు అవయవదానం చేశారు. జీవన్‌దాన్‌ వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలనగర్‌, తిరుమలగిరి రాజుకాలనీ(Balanagar, Tirumalagiri Raju Colony)కి చెందిన పిల్లి శ్యామ్‌బాబు(51) స్థానికంగా పాన్‌షాప్ నిర్వహిస్తున్నాడు. ఈనెల 21న బైక్‌పై ఇంటికి వెళ్తుండగా స్కిడ్‌అయి కిందపడిపోయాడు. తీవ్ర గాయాలు కావడంతో కుటుంబసభ్యులు ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు.


city4.2.jpg

ఈనెల 22న వైద్యులు బ్రెయిన్‌ డెడ్‌గా నిర్ధారించారు. జీవన్‌దాన్‌ వైద్యులు అవయవదానంపై శ్యామ్‌బాబు భార్య కాంతకు అవగాహన కల్పించారు. అందుకు ఆమె అంగీకరించడంతో ఆయన శరీరం నుంచి రెండు కిడ్నీలు, రెండు కార్నియాలు సేకరించిన వైద్యులు వాటిని మరో నలుగురికి అమర్చి ప్రాణం పోశారు. జనవరి నుంచి ఇప్పటి వరకు 103 మంది దాతల నుంచి అవయవాలను సేకరించినట్టు జీవనదాన్‌ నోడల్‌ అధికారి ప్రొఫెసర్‌ శ్రీభూషణ్‌రాజు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి.

గప్పా గప్పా గుద్ది.. రప్పా రప్పా జైల్లో వేయాలి

బండి సంజయ్‌ది అసత్య ప్రచారం

Read Latest Telangana News and National News

Updated Date - Jun 24 , 2025 | 09:54 AM