Hyderabad: హెల్మెట్ లేకుంటే ప్రాణం తీసుకుపోతా..
ABN , Publish Date - Dec 04 , 2025 | 10:53 AM
హైదరాబాద్ సిటీ పోలీసులు ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హైల్మెట్ ఉపయోగ, హెల్మెట్ లేకపోతే కలిగే అనర్ధాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు యమధర్మరాజు వేషాధారణలో వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు.
- ట్రాఫిక్ సిగ్నల్ వద్ద యముడి వేషధారణలో వినూత్న కార్యక్రమం
హైదరాబాద్: నిత్యం రద్దీగా ఉండే రసూల్‌ల్‌పుర చౌరస్తాలో రెడ్ సిగ్నల్ పడడంతో వాహనదారులు ఆగిపోయారు. ఇంతలో హెల్మెట్ లేని ఒక ద్విచక్ర వాహనదారుని వద్దకు తలమీద కిరీటం, ఒక చేతిలో గధ, మరో చేతిలో పాశం పట్టుకొని యముడి వేషధారణలో ఓ వ్యక్తి వచ్చాడు. హెల్మెట్ లేదు ప్రమాదం జరిగితే ప్రాణం తీసుకుపోతా అని హెచ్చరించాడు. రోడ్డు ప్రమాదాల నివారణకు సర్వేజనా ఫౌండేషన్ బుధవారం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

రోడ్డు ప్రమాదాల నివారణకు నగరంలోని 365 ప్రధాన జంక్షన్లను ఎంచుకొని సంవత్సరంపాటు ఈ కార్యక్రమం కొనసాగించనున్నట్లు సర్వేజనా ఫౌండేషన్ చైర్మన్ గురవారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సీఈవో విశాంత్ర ఐఏఎస్ బి. జనార్దన్‌రెడ్డి, జోనల్ కమిషనర్ రవికిరణ్, ట్రాఫిక్ ఏసీపీ శంకర్‌రాజు, ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..
మరింత పెరిగిన పుత్తడి ధరలు.. రికార్డు స్థాయికి వెండి
Read Latest Telangana News and National News