Hyderabad: తాను చనిపోతూ.. మరో ఏడుగురికి ప్రాణదానం
ABN , Publish Date - Aug 22 , 2025 | 10:26 AM
బ్రెయిన్‌డెడ్‌కు గురైన ఓ యువకుడి అవయవ దానంతో ఏడుగురికి ప్రాణదానం చేశారు. జీవన్‌దాన్ వైద్యులు తెలినిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా జనప్రియ వెస్ట్ సిటీ, మియాపూర్‌కు చెందిన భువనగిరి కృష్ణ సుమంత్ (37) ప్రైవేట్ ఉద్యోగి.
హైదరాబాద్: బ్రెయిన్‌డెడ్(Braindead)కు గురైన ఓ యువకుడి అవయవ దానంతో ఏడుగురికి ప్రాణదానం చేశారు. జీవన్‌దాన్ వైద్యులు తెలినిన వివరాల ప్రకారం రంగారెడ్డి(Rangareddy) జిల్లా జనప్రియ వెస్ట్ సిటీ, మియాపూర్‌కు చెందిన భువనగిరి కృష్ణ సుమంత్ (37) ప్రైవేట్ ఉద్యోగి. ఈనెల 18న ద్విచక్రవాహనంపై వెళుతూ బైక్‌పై నుంచి పడిపోయాడు. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కృష్ణ సుమంత్ బ్రెయిన్‌డెడ్‌కు గురైనట్టు వైద్యులు నిర్దారించారు.
జీవన్‌దాన్ ప్రతినిధులు అవయవ దానంపై ఆయన తండ్రి నరేందర్‌కు అవగాహన కల్పించడంతో ఆయన అందుకు అంగీకరించారు. కృష్ణ సుమంత్ శరీరం నుంచి 2 కిడ్నీలు, 2కార్నియాస్, లివర్, లంగ్, గుండె సేకరించి మరో ఏడుగురు వ్యక్తులకు అమర్చి వారికి ప్రాణదానం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఆరు నెలలకే పుట్టిన శిశువుకు ప్రాణం పోసి..
Read Latest Telangana News and National News