Fake voter IDs: సమంత, తమన్నా, రకుల్ ఫేక్ ఓటర్ ఐడీలు.. సోషల్ మీడియాలో వైరల్
ABN , Publish Date - Oct 16 , 2025 | 01:59 PM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో టాలీవుడ్ హీరోయిన్లు సమంత, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్ ఫేక్ ఓటర్ ఐడి లిస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓటర్ల జాబితాలో వీరి లిస్ట్ కనబడటంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 16: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో టాలీవుడ్ హీరోయిన్లు సమంత, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్ ఫేక్ ఓటర్ ఐడి లిస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓటర్ల జాబితాలో వీరి లిస్ట్ కనబడటంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే అధికారులు రూపొందించిన జాబితాలో నిజంగానే వీరి పేర్లు ఉన్నాయా? లేదా ఎవరైనా దురుద్దేశంతో ఇలా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారా? అనేది తెలియాల్సి ఉంది. వేరే ఓటర్ల ఎపిక్ నంబర్ తో హీరోయిన్ల ఫోటోలు పెట్టీ ఓటర్ ఐడీ కార్డులు తయారు చేసినట్లు తెలుస్తోంది. ఫేక్ ఓటర్ ఐడీల ప్రచారంపై హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారులు సీరియస్ అయ్యారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు.. ఎక్కడ వీటిని ఫ్యాబ్రికేట్ చేశారు? ఎవరు ప్రచారం చేశారు? అన్న అంశాలపై ఎన్నికల సంఘం విచారణ చేపట్టింది. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ చేయడంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదయింది.
అటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు దూసుకుపోతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి సునీతతో పలు డివిజన్లలో ముమ్మర ప్రచారం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రచారంలో దూసుకుపోతున్నాడు. అటు నిన్ననే తమ అభ్యర్థిపై బీజేపీ ప్రకటన విడుదల చేసింది. ఈ ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పేరును బీజేపీ అధిష్టానం ప్రకటించింది. దీంతో ఆయన కూడా ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మరికొద్ది రోజుల్లో ముగియనుంది. దివంగత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఈ స్థానానికి ఉపఎన్నిక వచ్చిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
BJP Vs Congress: మంత్రి కూతురి ఆరోపణలపై విచారణ చేయాల్సిందే: రామచంద్ర రావు
CP Sajjanar Warning: మైనర్లతో వీడియోలపై హైదరాబాద్ సీపీ స్ట్రాంగ్ వార్నింగ్