Share News

Inspectors: 146 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ

ABN , Publish Date - May 01 , 2025 | 07:32 AM

హైదరాబాద్‌ పోలీస్ కమిషనరేట్‌ పరిధిలో భారీ ఎత్తున ఇన్‌స్పెక్టర్ల బదిలీలు జరిగాయి. మొత్తం 146 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ చేస్తూ.. నగర సీపీ సీవీ ఆనంద్‌ ఆదేశాలు జారీ చేశారు. కాగా.. గత నెలలోనే బదిలీలంటాయని అందరూ అనుకున్నప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండటంతో అప్పుడు ఆగిపోయింది.

Inspectors: 146 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ

- భారీగా ఇన్‌స్పెక్టర్ల బదిలీలు..146 మందిని బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసిన సీపీ

హైదరాబాద్‌ సిటీ: హైదరాబాద్‌ కమిషనరేట్‌(Hyderabad Commissionerate) పరిధిలో పెద్ద ఎత్తున ఇన్‌స్పెక్టర్లను బదిలీలు చేస్తూ నగర సీపీ సీవీ ఆనంద్‌(City CP CV Anand) బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ఒకేసారి 146 మందిని బదిలీ చేశారు. రెండేళ్లుగా ఇన్‌స్పెక్టర్ల బదిలీలు జరగకపోవడం, ఎన్నికల కోడ్‌లు, బందోబస్తు విధులు ఉన్నందున ఒకేసారి భారీగా బదిలీ చేశారు.

ఈ వార్తను కూడా చదవండి: Miss World competitions: బొట్టుపెట్టి.. మంగళహారతులతో స్వాగతం


city2.jpg

ఎంపీ ఎన్నికల తర్వాత నుంచి బదిలీలు నిలిచిపోయాయి, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌(MLC Election Code) ముగిసిన తర్వాత బదిలీల ప్రక్రియ ఉంటుందని చాలా మంది ఊహించినప్పటికీ ఇంత పెద్ద ఎత్తున చేయడం చర్చనీయాంశమైంది. బదిలీ అయిన ఇన్‌స్పెక్టర్లు వెంటనే తమకు కేటాయించిన స్థానాల్లో విధుల్లో చేరాలని సీవీ ఆనంద్‌ ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి

రాహుల్‌గాంధీ కుటుంబానికి ఆర్‌ఎస్ఎస్, బీజేపీలు బద్ధ శత్రువులే కదా

ఉద్యోగాల్లేకనే యువత డ్రగ్స్‌కు బానిసలు

సాగర్‌కు యజమాని తెలంగాణే

సీఎం సవాల్‌ స్వీకరిస్తున్నా..

Read Latest Telangana News and National News

Updated Date - May 01 , 2025 | 07:32 AM