Share News

Hyderabad: 12 గంటలు.. 120 పాటలు

ABN , Publish Date - Feb 25 , 2025 | 08:26 AM

వర్దమాన గాయని ఆనందలక్ష్మి నిర్వహించిన పన్నెండు గంటల గానవిభావరి శ్రోతలను మంత్రముగ్ధులను చేసింది. త్యాగరాయ గానసభలో భారతీమణి ఫౌండేషన్‌, ఆనందలహరి కల్చరల్‌ ఈవెంట్స్‌ ఆధ్వర్యంలో తెలంగాణ(Telangana) భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో సినిమాపాటలతో పాటు అన్నమయ్య కీర్తనలు ఆలపించారు.

Hyderabad: 12 గంటలు.. 120 పాటలు

- ఏకధాటిగా కొనసాగిన గాన విభావరి

- వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో గాయని ఆనందలక్ష్మికి చోటు

హైదరాబాద్: వర్దమాన గాయని ఆనందలక్ష్మి నిర్వహించిన పన్నెండు గంటల గానవిభావరి శ్రోతలను మంత్రముగ్ధులను చేసింది. త్యాగరాయ గానసభలో భారతీమణి ఫౌండేషన్‌, ఆనందలహరి కల్చరల్‌ ఈవెంట్స్‌ ఆధ్వర్యంలో తెలంగాణ(Telangana) భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో సినిమాపాటలతో పాటు అన్నమయ్య కీర్తనలు ఆలపించారు. ఆనందలక్ష్మి గాయకులతో కలిసి 120 పాటలను ఆలపించి వండర్‌బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఈ ‘జంట’ పక్షులు.. మన అతిథులు..


వండర్‌బుక్‌(Wonderbook) ప్రతినిధి ధ్రువీకరణ పత్రాన్ని ఆనందలక్ష్మికి అందజేశారు. గాయకుడు దేవేందర్‌గౌడ్‌, వంశీ సంస్థల అధినేత వంశీ రామరాజు, బీజేపీ నేత వంశీకృష్ణ(BJP leader Vamsi Krishna), ఎస్‌బీఐ మాజీ ఏజీఎం త్రినాథరావు, సామాజిక కార్యకర్త వెంకటరావు, తదితరులు ఆనందలక్ష్మికి అభినందనలు తెలిపారు.


ఈవార్తను కూడా చదవండి: ఏఆర్‌ డెయిరీ ఎండీకి చుక్కెదురు

ఈవార్తను కూడా చదవండి: మేళ్లచెర్వులో మొదలైన జాతర సందడి

ఈవార్తను కూడా చదవండి: Kishan Reddy: బీఆర్‌ఎస్‌తో రేవంత్‌ కుమ్మక్కు

ఈవార్తను కూడా చదవండి: బాసరలో కిటకిటలాడుతున్న క్యూ లైన్లు, అక్షరాభ్యాస మండపాలు

Read Latest Telangana News and National News

Updated Date - Feb 25 , 2025 | 08:26 AM