Share News

Hyderabad: ఈ ‘జంట’ పక్షులు.. మన అతిథులు..

ABN , Publish Date - Feb 25 , 2025 | 08:11 AM

ఈ జాతి పక్షులు జంటగానే ప్రయాణిస్తాయి. జంటగానే కలిసి ఉంటాయి. ఎండిపోయిన పొడవాటి చెట్లు, ఎండిపోయిన మైదానాలు, అడవి ప్రాంతాలు వీటి ఆవాసం. అయితే ఏటా హైదరాబాద్‌(Hyderabad) చుట్టు పక్కల ప్రాంతాలకు ఇవి వలస వస్తుంటాయి.

Hyderabad: ఈ ‘జంట’ పక్షులు.. మన అతిథులు..

హైదరాబాద్: ఈ జాతి పక్షులు జంటగానే ప్రయాణిస్తాయి. జంటగానే కలిసి ఉంటాయి. ఎండిపోయిన పొడవాటి చెట్లు, ఎండిపోయిన మైదానాలు, అడవి ప్రాంతాలు వీటి ఆవాసం. అయితే ఏటా హైదరాబాద్‌(Hyderabad) చుట్టు పక్కల ప్రాంతాలకు ఇవి వలస వస్తుంటాయి. తిరిగి వర్షాలు పడే సమయానికి నగరం వీడి వెళ్లిపోతుంటాయి. ఆ పక్షుల పేరే హార్న్‌బిల్‌. ఇండియన్‌ గ్రే హార్న్‌బిల్‌గా పిలుచుకొనే ఈ పక్షులు దేశం మొత్తం ఉన్నాయి.

ఈ వార్తను కూడా చదవండి: Cyber ​​criminals: ఉద్యోగాల పేరుతో బురిడీ.. రూ.2లక్షలకు టోపీ


కానీ ఫిబ్రవరి నుంచి మే వరకు హైదరాబాద్‌లో కనిపిస్తాయి. అది కూడా ఉస్మానియా యూనివర్సిటీ, చిలుకూరు జింకల పార్కు, పీరంచెరువు వంటి పెద్ద చెరువులు వద్ద కనిపిస్తాయి. మూడు నుంచి నాలుగు నెలలు ఇవి మన నగరానికి అతిథులుగా పక్షి ప్రేమికులు పేర్కొంటారు. రెండు వారాల క్రితం గండిపేట మండలంలోని పీరంచెరువులో ప్రకృతి ప్రేమికులు, బర్డ్‌ వాచర్స్‌ ఈ పక్షుల ఫొటోలు తీసే ప్రయత్నం చేయగా కెమెరాకు చిక్కకుండా ఎగిరిపోయాయి.


city2.2.jpg

అయితే ప్రకృతి ప్రేమికుల గ్రూప్‌లో సభ్యుడైన హైదరాబాద్‌లోని ప్రముఖ చిల్డ్రన్స్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ సుదర్శన్‌(Children's Specialist Dr. Sudarshan) ఈ జంట పక్షులను వికారాబాద్‌(Vikarabad)లో తన కెమెరాలో బంధించారు. చెట్టు తొర్రలో పక్షిగుడ్లు పెడితే మగపక్షి ఆహారం తీసుకొస్తుంది. గుడ్లు పొదిగి పిల్లలు పుట్టిన తర్వాత కుటుంబం అంతా కలిసి ఎగిరిపోతాయని ఆయన తెలిపారు.


ఈవార్తను కూడా చదవండి: ఏఆర్‌ డెయిరీ ఎండీకి చుక్కెదురు

ఈవార్తను కూడా చదవండి: మేళ్లచెర్వులో మొదలైన జాతర సందడి

ఈవార్తను కూడా చదవండి: Kishan Reddy: బీఆర్‌ఎస్‌తో రేవంత్‌ కుమ్మక్కు

ఈవార్తను కూడా చదవండి: బాసరలో కిటకిటలాడుతున్న క్యూ లైన్లు, అక్షరాభ్యాస మండపాలు

Read Latest Telangana News and National News

Updated Date - Feb 25 , 2025 | 08:11 AM