Pushpa Movie Issue: తొక్కిసలాట ఘటన కేసులో కీలక పరిణామం
ABN , Publish Date - Aug 06 , 2025 | 03:22 PM
పుష్ప-2 మూమీ సంధ్యా థియేటర్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. పుష్ప పీవ్యూ షో ఘటనపై మానవ హక్కుల కమిషన్ విచారణ చేపట్టింది. విచారణలో కమిషన్ సీరియస్‌గా స్పందించింది.
హైదరాబాద్ : పుష్ప మూమీ సంధ్య థియేటర్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. పుష్ప పీవ్యూ షో ఘటనపై మానవ హక్కుల కమిషన్ విచారణ చేపట్టింది. విచారణలో కమిషన్ సీరియస్‌గా స్పందించింది. పుష్ప ఘటనకు సంబంధించి చీఫ్ సెక్రటరీకి నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపింది. పుష్ప ఘటనలో చనిపోయిన బాధితులకు ఐదు లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అలాగే.. పుష్ప ఘటనలో పోలీస్‌ల వ్యవహారంపై కూడా నివేదిక సమర్పించాలని కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
గత ఏడాది పుష్ప -2 మూవీ ప్రీమియర్ షోను ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్యా థియేటర్‌లో ప్రదర్శించారు. అయితే అదే సమయంలో థియేటర్ వద్దకు హీరో అల్లు అర్జున్ రావడంతో ఆయనను చూడటానికి భారీగా అభిమానులు చేరారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో సినిమా చూడటానికి వచ్చిన రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై రేవతి కుటుంబానికి పుష్ప మూవీ టీమ్ పరిహారం అందజేసింది. గతంలో ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సంగతీ తెలిసిందే.. అయితే తీవ్రంగా గాయపడిన రేవతి కుమారుడు శ్రీతేజ్ చాలా రోజులు తరువాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. కాగా, శ్రీతేజ్ ఇప్పుడిప్పుడే గాయాల నుంచి కోలుకుంటున్నట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి
కామారెడ్డి డిక్లరేషన్‌పై కాంగ్రెస్ మాట తప్పింది: బండి సంజయ్
చట్టవిరుద్ధ యాప్‌లకు ప్రమోషన్ ఎందుకు.. విజయ్ దేవరకొండపై ఈడీ ప్రశ్నల వర్షం