Share News

High Court: ప్రైవేటు ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చలేరు

ABN , Publish Date - Feb 07 , 2025 | 04:38 AM

రిజిస్ట్రేషన్‌ చట్టంలోని సెక్షన్‌ 22-ఏ పరిధిలోకి రాని ప్రైవేటు ఆస్తులను నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చలేరని హైకోర్టు పేర్కొంది.

High Court: ప్రైవేటు ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చలేరు

  • ఆ అధికారం ప్రభుత్వాధికారులకు లేదు: హైకోర్టు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): రిజిస్ట్రేషన్‌ చట్టంలోని సెక్షన్‌ 22-ఏ పరిధిలోకి రాని ప్రైవేటు ఆస్తులను నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చలేరని హైకోర్టు పేర్కొంది. అన్ని పత్రాలూ ఉన్న ప్రైవేటు ఆస్తుల రిజిస్ట్రేషన్‌ను అడ్డుకునే అధికారం ప్రభుత్వ అధికారులకు లేదని స్పష్టంచేసింది. ‘వింజమూరి రాజగోపాలచారి’ కేసులో సెక్షన్‌ 22-ఏకు సంబంధించి అనుసరించాల్సిన మార్గదర్శకాలను ఇదే హైకోర్టు విస్తృత ధర్మాసనం జారీచేసిందని గుర్తుచేసింది. ఆ సెక్షన్‌కు విరుద్ధంగా అధికారులు తమకు నచ్చినట్లుగా ప్రైవేటు ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చలేరని పేర్కొంది.


మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలోని బాచుపల్లిలో సర్వే నంబరు 132లో ఉన్న 1.26 ఎకరాల భూమి సేల్‌ డీడ్‌ సిద్ధం చేసుకొని ధరణి పోర్టల్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్‌ నిలిపేయడం చెల్లదని హైకోర్టులో టి.వెంకటసుబ్బయ్య, ఎన్‌.ప్రశాంత్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. చట్టప్రకారం అన్ని పత్రాలు ఉంటే రిజిస్ట్రేషన్‌ చేయాల్సిందేనని, నాలుగు వారాల్లో ఈ ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించింది.

Updated Date - Feb 07 , 2025 | 04:38 AM