High Court: భవన్స్ కళాశాల తీరుపై హైకోర్టు ఆగ్రహం
ABN , Publish Date - Mar 05 , 2025 | 07:35 AM
నేటినుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో హాల్‌టికెట్ ఇవ్వకుండా విద్యార్థినిని వేధిస్తున్న సైనిక్‌పురి భవన్స్ శ్రీ అరబిందో జూనియర్ కళాశాల యాజమాన్యంపై హైకోర్టు(High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది.

- హాల్ టికెట్ ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టిన న్యాయస్థానం
హైదరాబాద్: నేటినుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో హాల్‌టికెట్ ఇవ్వకుండా విద్యార్థినిని వేధిస్తున్న సైనిక్‌పురి భవన్స్ శ్రీ అరబిందో జూనియర్ కళాశాల యాజమాన్యంపై హైకోర్టు(High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్(Transfer certificate) ఇవ్వలేదనే సాకుతో హాల్‌టికెట్ ఇవ్వకపోవడం చట్టవిరుద్ధమని వ్యాఖ్యానించింది. తక్షణమే ఆమెకు హాల్‌టికెట్‌ను అందజేయాలని సదరు కళాశాల ప్రిన్సిపాల్‌ను ఆదేశించింది.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: దారుణం.. కాళ్లు చేతులు కట్టేసి.. కత్తితో పొడిచి..
అలాగే ఆ విద్యార్థిని పరీక్షా ఫలితాలను వెలువరించకుండా సీల్డ్ కవరులో కోర్టుకు అందజేయాలని ఇంటర్మీడియట్ బోర్డును ఆదేశించింది. కాప్రా సర్కిల్ కమలానగర్(Kapra Circle Kamalanagar)కు చెందిన మైసగోని శ్రీనిధి అనే విద్యార్థిని ఈసీఐఎల్‌లోని ఎస్‌ఆర్‌డీజీ స్కూల్‌లో గతేడాది 10వ తరగతి ఉత్తీర్ణురాలవగా, ఫీజు చెల్లించలేదనే కారణంతో పాఠశాల యాజమాన్యం శ్రీనిధికి టీసీ ఇవ్వలేదు. దాంతో అప్పట్లో ఆమె కోర్టును ఆశ్రయించి టీసీ లేకుండానే భవన్స్ శ్రీ అరబిందో జూనియర్ కాలేజీలో ఇంటర్‌లో చేరింది.
ఈ వార్తను కూడా చదవండి: పదవుల కోసం పైరవీలు వద్దు
ఈ వార్తను కూడా చదవండి: సకల సదుపాయాలతో అర్బన్ పార్కులు
ఈ వార్తను కూడా చదవండి: ప్రజారోగ్యంపై పట్టింపేదీ!
ఈ వార్తను కూడా చదవండి: హాలియాలో పట్టపగలు దొంగల బీభత్సం
Read Latest Telangana News and National News