High Court: మేజర్ అయిన యువతిని స్టేట్ హోంలో నిర్బంధించలేరు: హైకోర్టు
ABN , Publish Date - Aug 21 , 2025 | 04:57 AM
మేజర్ అయిన యువతిని ఆమె అభీష్టానికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వ హోంలో నిర్బంధించలేరని హైకోర్టు స్పష్టంచేసింది.
హైదరాబాద్, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): మేజర్ అయిన యువతిని ఆమె అభీష్టానికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వ హోంలో నిర్బంధించలేరని హైకోర్టు స్పష్టంచేసింది. ఆ యువతి ఇష్టప్రకారం నిర్ణయం తీసుకోవాలని, కావాలంటే ఆమెను స్వేచ్ఛగా వదిలేయాలని.. అయితే యువతి సంక్షేమాన్ని ప్రతినెలా పరిశీలించాలని యాదాద్రి భువనగిరి జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఆదేశాలు జారీచేసింది. స్టేట్‌హోం నుంచి విడుదలైన యువతి ప్రభుత్వ పథకాలు, సహాయం కోసం కోరవచ్చని తెలిపింది. 2018లో బాలికల అక్రమ రవాణా, వ్యభిచారం కేసులో ఓ మహిళపై పోలీసులు కేసు పెట్టారు.
ఆమె వద్ద ఉన్న బాలికను స్టేట్‌హోంకు తరలించారు. తర్వాత ఆమహిళపై కేసు వీగిపోయింది. ఇప్పుడామె.. ఆ బాలిక మేజర్ అయిందని.. ఎలాంటి కేసూ పెండింగ్‌లో లేకున్నా యువతిని నిర్బంధించారని హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. యువతి అభీష్టానికి విరుద్ధంగా నిర్బంధించడానికి వీలులేదని.. ఆమె ఇష్టప్రకారం విడుదల చేయాలని మహిళా, శిశు సంక్షేమ శాఖను ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది.
తెలంగాణకు ఐఐఎం కేటాయించండి
రాజ్యసభలో కె.లక్ష్మణ్, వద్దిరాజు డిమాండ్
న్యూఢిల్లీ, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): తెలంగాణకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)ను కేటాయించాలని ఎంపీలు కె.లక్ష్మణ్, వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు. ఐఐ ఎం సవరణ బిల్లు 2025పై బుధవారం రాజ్యసభలో జరిగిన చర్చలో పాల్గొంటూ వారు ఈ డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో ఐఐఎం ఏర్పాటుకు అన్ని అర్హతలున్నాయని, ప్రజల ఆకాంక్షల మేరకు దీనిని పూర్తిచేయాలని వారు కోరారు. కాగా, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్) ఆధునికీకరణకు కేంద్రం సహకరించాలని ఎంపీ రఘురాం రెడ్డి కోరారు. బుధవారం లోక్‌సభలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. కేటీపీఎస్ 820 మెగావాట్ల విద్యుత్తును అందిస్తోందని తెలిపారు. విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని దీన్ని విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. ఆధునికీకరణకు కేంద్రం సాంకేతిక, ఆర్థికసాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బతుకమ్మ కుంట అభివృద్ధి పనులపై హైడ్రా ఫోకస్
హైదరాబాద్‌పై ప్రపంచ దృష్టి.. అభివృద్ధిని అడ్డుకునే వారే శత్రువులు: సీఎం రేవంత్‌రెడ్డి
Read latest Telangana News And Telugu News