Hyderabad Land Dispute: నాగారం ఐఏఎస్, ఐపీఎస్‌ల భూములపై విచారణ కమిషన్ వేస్తారా?
ABN , Publish Date - Jul 19 , 2025 | 05:34 AM
నాగారంలో భూదాన్ భూములుగా పేర్కొంటున్న స్థలాలను ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు ఐఏఎ్‌సలు, ఐపీఎ్‌సలు అక్రమంగా పట్టాలు చేయించుకున్నారన్న ఆరోపణలపై విచారణ కమిషన్ వేసే ఉద్దేశం ఉందా..
వివరణ ఇవ్వాలని ఐపీఎస్‌కు హైకోర్టు ఆదేశాలు
హైదరాబాద్, జూలై 18 (ఆంధ్రజ్యోతి): నాగారంలో భూదాన్ భూములుగా పేర్కొంటున్న స్థలాలను ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు ఐఏఎ్‌సలు, ఐపీఎ్‌సలు అక్రమంగా పట్టాలు చేయించుకున్నారన్న ఆరోపణలపై విచారణ కమిషన్ వేసే ఉద్దేశం ఉందా? లేదా? చెప్పాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని శుక్రవారం సీఎ్‌సకు ఆదేశాలు జారీచేసింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలోని సర్వే 181, 182, 194, 195 నెంబర్లలోని భూములను నిషేధిత జాబితాలో పెట్టాలని, రికార్డుల సవరణ చేయకూడదని, లావాదేవీలు నిర్వహించకూడదని ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అయినా సర్వే నెంబర్ 194, 195 లలో రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి, సీసీఎల్‌ఏ హోదాలో పనిచేసిన ఐఏఎస్ నవీన్‌మిట్టల్ సహా ఇతర ఐఏఎ్‌సలు, ఐపీఎ్‌సలు అక్రమంగా పట్టాలు చేయించుకున్నారని, దీనిపై దర్యాప్తునకు విచారణ కమిషన్‌ను నియమించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నాగారం గ్రామం పడమటి తండాకు చెందిన వడిత్య రాములు ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో పలువురు ఐఏఎ్‌సలు, ఐపీఎ్‌సలను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చారు.
వారిలో డీ అమోయ్‌కుమార్, ఎస్ హరీశ్, అనురాగ్ శర్మ, బీకే రాహుల్ హెగ్డే, లెంకల సుబ్బారాయుడు, అజయ్ జైన్, ఎం. దివ్యశ్రీ, పేర్ల వరుణ్, రేణు గోయల్ (జితేందర్‌కుమార్ గోయల్), తరుణ్ జోషి, రాజర్షి షా, రవి గుప్తా, రేఖా షరాఫ్ (ఉమేశ్ షరాఫ్), స్వాతీ లక్రా, సౌమ్యా మిశ్రా, టీ శ్రీనివాసరావు, ముదిరెడ్డి నితేష్ రెడ్డి (ముదిరెడ్డి మహేందర్‌రెడ్డి), మహేశ్ మురళీధర్ భగవత్, దండ రాధిక (వీబీ కమలాసన్‌రెడ్డి), రీటా సుల్తానియా (సందీ్‌పకుమార్ సుల్తానియా), అజిత్‌కుమార్ మహంతి, వసుంధరా సిన్హా (అంజనీకుమార్), ఐశ్వర్య రాజ్ (వికాస్ రాజ్), తాటిపర్తి పావనీరావు (టీ ప్రభాకర్‌రావు), డాక్టర్ జ్ఞానముద్ర (సోమేశ్‌కుమార్), నవీన్‌మిట్టల్ తదితరులు ఉన్నారు. వీరితోపాటు రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ ముఖ్యకార్యదర్శి, సీసీఎల్‌ఏ, రంగారెడ్డి కలెక్టర్, ఆర్డీవో, మహేశ్వరం తహసీల్దార్, ఈడీ తదితరులను అధికారిక ప్రతివాదులుగా చేర్చారు. సర్వే నెంబర్ 194, 195లో ఎస్టీ వర్గానికి చెందిన తనకు వారసత్వంగా వస్తున్న 10.17 ఎకరాల భూమి ఉందని, తన తండ్రి జమాలా ఆ భూములను కొనుగోలు చేశారని పిటిషనర్ రాములు పేర్కొన్నారు. 2020లో తన తండ్రి మరణాంతరం ఆ భూములు తన పేరుపై మ్యుటేషన్ కావడంతోపాటు ఈ-పట్టాదార్ పాస్‌పుస్తకాలు సైతం జారీఅయ్యాయని తెలిపారు. అయితే పలుకుబడి కలిగిన కొంతమంది వ్యక్తులు రికార్డుల్లో మార్పులు చేయించారని ఆరోపించారు. ఈ మొత్తం కుంభకోణంపై విచారణ కమిషన్ వేయాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ ముఖ్యకార్యదర్శికి పలుమార్లు వినతిపత్రాలు అందజేసినట్లు పేర్కొన్నారు. వారి నుంచి స్పందన రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. ఈ పిటిషన్ జస్టిస్ కే లక్ష్మణ్ ఎదుట విచారణకు వచ్చింది. సీఎ్‌సకు ఆదేశాలు జారీచేసిన ధర్మాసనం తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి