Share News

Harish Rao: రంగనాయకసాగర్‌కు నీరు వదిలి రైతులను ఆదుకోండి: హరీశ్‌

ABN , Publish Date - Mar 02 , 2025 | 04:15 AM

సిద్దిపేట నియోజకవర్గంలో సాగునీరు అందక పంట పొలాలు ఎండిపోతున్నాయని, మిడ్‌ మానేరు నుంచి రంగనాయక సాగర్‌లోకి నీటిని ఎత్తిపోసి రైతులను ఆదుకోవాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌ రావు కోరారు.

Harish Rao: రంగనాయకసాగర్‌కు నీరు వదిలి రైతులను ఆదుకోండి: హరీశ్‌

సిద్దిపేట కల్చరల్‌, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): సిద్దిపేట నియోజకవర్గంలో సాగునీరు అందక పంట పొలాలు ఎండిపోతున్నాయని, మిడ్‌ మానేరు నుంచి రంగనాయక సాగర్‌లోకి నీటిని ఎత్తిపోసి రైతులను ఆదుకోవాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌ రావు కోరారు. ఈ మేరకు శనివారం ఆయన మంత్రికి ఫోన్‌ చేశారు. రంగనాయక సాగర్‌ కింద ప్రతి యేటా గణనీయంగా పంటల దిగుబడి పెరుగుతోందన్నారు. ఈసారి 50 వేల ఎకరాల పంట వేశారని, ప్రస్తుతం రంగనాయకసాగర్‌లో 1.5 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉందని చెప్పారు. యాసంగి పంటకు పూర్తి స్థాయిలో నీరు అందాలంటే అంటే ఇంకా కనీసం ఒక టీఎంసీ నీరు అవసరం ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో మిడ్‌ మానేరు నుంచి రంగనాయక సాగర్‌లోకి వెంటనే నీళ్లు పంపింగ్‌ చేసేలా అధికారులను ఆదేశించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Updated Date - Mar 02 , 2025 | 04:16 AM