Harish Rao: కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేసేవాళ్లు ఏం తింటున్నరో?
ABN , Publish Date - Jun 01 , 2025 | 04:16 AM
కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతులు రెండు పంటలు పండించుకుంటుంటే, కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేసేవాళ్లు కొందరు ఏం తింటున్నారో అర్థం కావడం లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉత్తమ్‌వి అన్నీ ఉత్త మాటలే.. వందశాతం రుణమాఫీ ఎక్కడ?
మహేశ్‌కుమార్ గౌడ్‌వి చిల్లర వ్యాఖ్యలు: హరీశ్‌రావు
సిద్దిపేట రూరల్, హైదరాబాద్, మే 31 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతులు రెండు పంటలు పండించుకుంటుంటే, కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేసేవాళ్లు కొందరు ఏం తింటున్నారో అర్థం కావడం లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం సిద్దిపేట రూరల్ మం డలం రాఘవాపూర్‌లో, నారాయణరావుపేట మండలం గుర్రాలగొందిలో బోనాల ఉత్సవాల్లో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడారు. కాళేశ్వరంతో ఎలాంటి ఉపయోగం జరగలేదని ఉత్తి మాటలు చెబుతున్న ఉత్తమ్ కుమార్‌రెడ్డికి మండుటెండల్లో మత్తళ్లు దుంకుతున్నా, చెరువుల్లో నీళ్లు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేశామని గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి ఏ ఒక్క గ్రామంలోనూ వంద శాతం రుణమాఫీ చేయలేదన్నారు.
రుణమాఫీ విషయంలో ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరిన సీఎం పత్తాలేడని విమర్శించారు. కాగా, పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉండి మహేశ్ కుమార్ గౌడ్ చేస్తున్న చిల్లర వ్యాఖ్యలను తీవ్రం గా ఖండిస్తున్నట్లు హరీశ్ రావు ఎక్స్‌లో పేర్కొన్నారు. ‘బట్ట కాల్చి మీద వేసినంత మాత్రాన అబద్ధాలు, నిజంఅయిపోవు. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాను తప్ప, మీలాగా చిల్లర రాజకీయాలు చేసి లబ్ధి పొందాలని చూడను’ అని పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలుపై దృష్టి పెట్టాలని సూచించారు. కాగా, కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్, బీజేపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ, వాస్తవాలను ప్రజల ముందుంచడానికి జూన్ 2న తెలంగాణ భవన్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు.
బహిరంగ మార్కెట్లో సింగరేణి విద్యుత్
మిగులు విద్యుత్‌ను అమ్ముకోవడానికి ప్రభుత్వం ఓకే
హైదరాబాద్, మే 31 (ఆంధ్రజ్యోతి): మిగులు విద్యుత్‌ను బహిరంగ మార్కెట్లో అమ్ముకునేందుకు సింగరేణి సంస్థకు ప్రభుత్వం అనుమతిచ్చింది. సింగరేణికి మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద 1,200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రంతో పాటు పలు చోట్ల 300 మెగావాట్లకు పైగా సోలార్ ప్లాంట్లు ఉన్నాయి. రాష్ట్ర విద్యుత్ సంస్థలకు సరఫరా చేయగా మిగిలే విద్యుత్‌ను ఓపెన్ యాక్సె్‌సలో విక్రయించడానికి సింగరేణి సంస్థకు అనుమతిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో విద్యుత్ విక్రయ ప్రక్రియను శనివారం రాత్రి సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ ప్రారంభించారు. సింగరేణి ఏటా 1,200 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తుండగా ఇందులో అధిక భాగం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. మిగిలే విద్యుత్తును దేశంలోని రాష్ట్రాలు, సంస్థలకు బహిరంగ విపణిలో విక్రయించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అనుమతిచ్చారని బలరామ్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
jagtyaala : పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి..
Crime News: తెలంగాణ భవన్ నుంచి సైబర్ నేరస్తుడు పరారీ..
TG News: ఢీకొన్న రెండు కార్లు.. ఆ తర్వాత ఏమైందంటే..
Indigo Flight Delay: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య
Read Latest Telangana News And Telugu News