New liquor Stores: మద్యం దుకాణాల దరఖాస్తు రూ.3 లక్షలు!
ABN , Publish Date - Aug 21 , 2025 | 03:38 AM
రాష్ట్రంలో రెండేళ్ల కాలానికి కొత్త మద్యం దుకాణాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 2025-27కు గాను దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తులను స్వీకరించనుంది.
రాష్ట్రంలో కొత్త దుకాణాల ఏర్పాటుకు సర్కారు అనుమతి
దరఖాస్తుల స్వీకరణకు త్వరలో ప్రకటన
డిసెంబరు 1 నుంచి కొత్త మద్యం దుకాణాలు
హైదరాబాద్, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రెండేళ్ల కాలానికి కొత్త మద్యం దుకాణాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 2025-27కు గాను దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తులను స్వీకరించనుంది. ఇందుకోసం త్వరలోనే ప్రకటన విడుదల కానుంది. కొత్త మద్యం దుకాణాల ఏర్పాటుకు ఈ నెల 14న గెజిట్ విడుదలైన నేపథ్యంలో.. దుకాణాల దరఖాస్తు గడువును ఎక్సైజ్ కమిషనర్ నిర్ణయిస్తారు. ఏ4 దుకాణాల దరఖాస్తు రుసుమును సర్కారు ఏకంగా 50 శాతం పెంచింది. గతంలో రూ.2 లక్షలుగా ఉన్న రుసుమును ప్రస్తుతం రూ.3 లక్షలుగా నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న 2620 దుకాణాల గడువు నవంబరు 30తో ముగియనుంది.
2025 డిసెంబరు 1 నుంచి కొత్త మద్యం దుకాణాల నిర్వహణ మొదలవుతుంది. 2025 డిసెంబరు 1 నుంచి 2027 నవంబరు 30 వరకు కొత్త దుకాణాల నిర్వహణకు ప్రభుత్వం అనుమతిస్తోంది. దుకాణాల్లో గౌడ్‌లకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం చొప్పున కేటాయించనున్నారు. అనుమతి పొందిన వారు వార్షిక రుసుముతోపాటు అదనంగా రూ.5 లక్షలు చెల్లిస్తే వాకిన్ లిక్కర్ స్టోర్ ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కల్పిస్తారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మద్యం దుకాణాల నిర్వహణ వేళలు ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు, జిల్లాల్లో ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటాయి.
2011 జనాభా లెక్కల
ప్రకారం దుకాణాల ఫీజుల వివరాలు
జనాభా దుకాణం ఫీజు(రూ.లక్షల్లో)
5 వేలు 50
5-50 వేలు 55
50 వేల నుంచి లక్షలోపు 60
1-5 లక్షలు 65
5-20 85
20 లక్షల పైన 1.10 కోట్లు
అనుమతి పొందిన వారు వార్షిక రుసుముతోపాటు అదనంగా రూ.5 లక్షలు చెల్లిస్తే వాకిన్ లిక్కర్ స్టోర్ ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కల్పిస్తారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మద్యం దుకాణాల నిర్వహణ వేళలు ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు, జిల్లాల్లో ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
బతుకమ్మ కుంట అభివృద్ధి పనులపై హైడ్రా ఫోకస్
హైదరాబాద్‌పై ప్రపంచ దృష్టి.. అభివృద్ధిని అడ్డుకునే వారే శత్రువులు: సీఎం రేవంత్‌రెడ్డి
Read latest Telangana News And Telugu News