Governor Vishnu Dev Varma: 38 గ్రామాల్లో స్టీల్ బ్యాంకులు
ABN , Publish Date - Jul 18 , 2025 | 04:24 AM
పర్యావరణ పరిరక్షణ, ప్రజల ఆరోగ్య సంరక్షణను కూడా మానవసేవగా పరిగణిస్తారని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు.
మహిళా సంఘాలకు ప్లేట్లు పంపిణీ చేసిన గవర్నర్, మంత్రులు
సిద్దిపేట, జూలై 17(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పర్యావరణ పరిరక్షణ, ప్రజల ఆరోగ్య సంరక్షణను కూడా మానవసేవగా పరిగణిస్తారని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ప్రజల ఆరోగ్యంతో పాటు భూమి ఆరోగ్యాన్ని కూడా పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం 38 గ్రామైక్య మహిళా సంఘాలకు స్టీల్ కిట్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌తో కలిసి గవర్నర్ పాల్గొన్నారు.
భూమిని కలుషితం కాకుండా కాపాడుకోవాలని, ప్లాస్టిక్‌ను నియంత్రించడమే లక్ష్యంగా ప్రజలందరూ పనిచేయాలని గవర్నర్ పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వస్తువుల స్థానంలో మహిళలకు స్టీల్ ప్లేట్లు, గ్లాసులు అందించాలనే ఆలోచన ప్రశంసనీయమని మంత్రి ప్రభాకర్‌ను కొనియాడారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. ప్లాస్టిక్ నియంత్రణ కోసం పొన్నం ప్రభాకర్ చేపట్టిన స్టీల్ బ్యాంకు ఉద్యమం చాలా గొప్పదన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలోనూ స్టీల్ బ్యాంకులు ఏర్పాటు చేసి హుస్నాబాద్‌ను ఆరోగ్య హుస్నాబాద్‌ను తీర్చిదిద్దుతానని తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గంలో 74 వేల స్టీల్ బ్యాంకు కిట్లు పంపిణీ చేశామని తెలిపారు.
ఇవి కూడా చదవండి
కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25లో ఏపీకి 5 పురస్కారాలు..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి