Jishnu Dev Verma: సమాజాభివృద్ధిలో మహిళా సాధికారత కీలకం
ABN , Publish Date - Feb 04 , 2025 | 03:54 AM
సమాజాభివృద్ధిలో మహిళా సాధికారత అత్యంత కీలకమైన అంశమని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. మహిళా సాధికారతలేకుండా స్థిరమైన భవిష్యత్తును ఊహించలేమని, ఆర్థికాభివృద్ధిలో వీరి పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ... వి-హబ్ సందర్శన
హైదరాబాద్, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): సమాజాభివృద్ధిలో మహిళా సాధికారత అత్యంత కీలకమైన అంశమని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. మహిళా సాధికారతలేకుండా స్థిరమైన భవిష్యత్తును ఊహించలేమని, ఆర్థికాభివృద్ధిలో వీరి పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. మహిళలకు సమాన అవకాశాల కల్పనకు, సుస్థిరమైన భవిష్యత్తును అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.. అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలోని విమెన్ ఆంత్రప్రెన్యూర్ హబ్ (వి-హబ్)ను సోమవారం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి గవర్నర్ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి మహిళా స్టార్ట్‌పలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. స్టార్ట్‌పల ప్రతినిధులతో మాట్లాడారు. వి-హబ్‌కు వచ్చాక తమ ఆలోచనలు కార్యరూపం దాల్చాయని, ప్రభుత్వపరంగాపూర్తి సహకారం లభిస్తోందని మహిళా స్టార్ట్‌పల ప్రతినిధులు గవర్నర్‌తో పేర్కొన్నారు. గ్రామీణ మహిళల సాధికారతకు అమలుచేస్తున్న పథకాలను గవర్నర్‌కు మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు. వి-హబ్ సీఈవో సీతా పల్లచోల్ల మాట్లాడుతూ.. వి-హబ్‌తో మారుమూల గ్రామాల వరకు సేవలు అందిస్తున్నామన్నారు.
ఏఐ వర్సిటీలో పరిశ్రమల భాగస్వామ్యం: దుద్దిళ్ల
ఏఐ యూనివర్సిటీలో పరిశ్రమలు, నిపుణులను భాగస్వామ్యం చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. సోమవారం హైటెక్ సిటీలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సేవల టెక్నాలజీ అందిస్తున్న డిపాజిటరీ ట్రస్ట్, క్లియరింగ్ కార్పొరేషన్ నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎమర్జింగ్ టెక్నాలజీ్‌సలో పెట్టుబడులు పెట్టాలనుకునే పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా ప్రోత్సహిస్తామని తెలిపారు. కొత్త కార్యాలయంతో దాదాపు 2వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ఉద్యోగ నియామకాల్లో స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి కోరగా.. కంపెనీ అంగీకరించింది.
ఇవి కూడా చదవండి..
KTR: రాష్ట్రంలో ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. వేటు తప్పదా..
Gun Firing Case: రూ.333 కోట్లు.. వంద మంది యువతులే టార్గెట్.. వెలుగులోకి ప్రభాకర్ నేరాలు
Supreme Court: తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత కేసు.. సుప్రీంకు కేటీఆర్
Read Latest Telangana News And Telugu News