Governor: 4 సంస్థలకు రూ. 38.59లక్షల గ్రాంట్లు
ABN , Publish Date - Apr 10 , 2025 | 04:38 AM
సామాజిక సంక్షేమం, విద్యా, సేవారంగాల్లో కృషి చేస్తున్న నాలుగు సంస్థలకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రూ.38.59లక్షల గ్రాంట్లను బుధవారం రాజ్‌భవన్‌లో అందచేశారు.

గవర్నర్ విచక్షణ కోటా కింద నిధుల అందజేత
హైదరాబాద్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): సామాజిక సంక్షేమం, విద్యా, సేవారంగాల్లో కృషి చేస్తున్న నాలుగు సంస్థలకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రూ.38.59లక్షల గ్రాంట్లను బుధవారం రాజ్‌భవన్‌లో అందచేశారు. గవర్నర్ విచక్షణ కోటా కింద ఈ నిధులను ఆయన విడుదల చేశారు. మానవ అక్రమ రవాణాకువ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ప్రజ్వల స్వచ్ఛంద సంస్థకు రూ. 20లక్షలు, మారుమూల ప్రాంతాల్లో విద్యారంగంలో సేవలందిస్తున్న పీజీయుకేటీ సంస్థకు రూ. 15లక్షలు, సికింద్రాబాద్‌లోని ఆర్మీ డెంటల్ కళాశాలకు రూ. 2.24 లక్షలు, మయూరి మార్గ్‌లోని సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్‌కు రూ. 1.35లక్షల గ్రాంటుకు సంబంధించిన డిడీలను గవర్నర్ అందచేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మడి కట్టుకోవడం అంటే ఏమిటో తెలుసా
ఉపవాసం ఉంటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..
గుడికి వెళ్తున్నారా.. ఇవి పాటించండి..
For More AP News and Telugu News