Share News

Jishnu Dev Varma: అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి

ABN , Publish Date - Jan 26 , 2025 | 04:19 AM

ప్రతి పౌరుడు ఓటు హక్కును బాధ్యతగా భావించాలని రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ పేర్కొన్నారు. ప్రతి ఒక్క రూ ఓటు హక్కును వినియోగించుకోవాలని, అది మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నారు.

Jishnu Dev Varma: అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి

  • అది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు

  • గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ

హైదరాబాద్‌ సిటీ, రవీంద్రభారతి, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): ప్రతి పౌరుడు ఓటు హక్కును బాధ్యతగా భావించాలని రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ పేర్కొన్నారు. ప్రతి ఒక్క రూ ఓటు హక్కును వినియోగించుకోవాలని, అది మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో 15వ జాతీయ ఓటరు దినోత్సవాలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్‌ ఎన్నికల నిర్వహణలో ఉత్తమంగా పనిచేసిన పలువురు జిల్లా కలెక్టర్లు, బూత్‌ లెవల్‌ అధికారులకు ఉత్తమ ఎన్నికల ఆచరణాత్మక అవార్డులను ప్రదానం చేశారు. అనంతరం గవర్నర్‌ మాట్లాడుతూ.. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు.


ఈ సందర్భంగా ఉత్తమ ఎన్నికల ఆచరణాత్మక అవార్డులను టూరిజం డైరెక్టర్‌, ఐఏఎస్‌ హనుమంత్‌ కొనిబా, అదిలాబాద్‌ కలెక్టర్‌ రాజర్షి షా, కామారెడ్డి కలెక్టర్‌ ఆశీష్‌ సాంగ్వాన్‌, కొమురం బీమ్‌ ఆసిఫాబాద్‌ కలెక్టర్‌ వెంకటేష్‌ దొత్రే, హనుమకొండ కలెక్టర్‌ ప్రావీణ్య, హైదరాబాద్‌ కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి, మంచిర్యాల కలెక్టర్‌ బి.రాహుల్‌, సిద్దిపేట కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌, వనపర్తి కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, అసిస్టెంట్‌ ఐజీ రమణకుమార్‌, ఏసీపీ స్పెషల్‌ బ్రాంచ్‌-వరంగల్‌ జితేందర్‌రెడ్డి, ఆర్డీవో ఎన్‌.జగదీశ్వర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ బోడకుంటి తిరుపతి, తహసీల్దార్‌ శ్రీనివాస్‌ రెడ్డి, ఏఈఆర్‌వో విజయకుమార్‌ తదితరులు అందుకున్నారు.


ఇవీ చదవండి:

క్రికెట్ చరిత్రలో సంచలనం.. 73 ఏళ్ల ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్

రంజీ ట్రోఫీ.. రోహిత్ టీమ్ ఘోర ఓటమి

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 26 , 2025 | 04:19 AM