Share News

Aadi Srinivas: బనకచర్లపై హరీశ్‌ బుకాయింపు..

ABN , Publish Date - Jun 22 , 2025 | 03:46 AM

బనకచర్ల ప్రాజెక్టుపై తమ బాగోతం బయటపడిందనే హరీశ్‌రావు బుకాయింపు మాటలు మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ మండిపడ్డారు.

Aadi Srinivas: బనకచర్లపై హరీశ్‌ బుకాయింపు..

  • బీఆర్‌ఎస్‌ జలద్రోహాన్ని బయటపెట్టడంతో సెంటిమెంట్‌ను రగిల్చే యత్నం: ఆది శ్రీనివాస్‌

  • మంత్రివర్గంలో స్థానం కల్పించాలంటూ ఖర్గేకు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి విజ్ఞప్తి

హైదరాబాద్‌/న్యూఢిల్లీ, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): బనకచర్ల ప్రాజెక్టుపై తమ బాగోతం బయటపడిందనే హరీశ్‌రావు బుకాయింపు మాటలు మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ మండిపడ్డారు. మామాఅల్లుళ్లు (కేసీఆర్‌, హరీశ్‌) కలిసి తెలంగాణకు చేసిన జలద్రోహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి బయటపెట్టారన్నారు. శనివారం సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడు తూ.. పదేళ్లు అధికారంలో ఉండి అడ్డగోలుగా వ్యవహారించిన కేసీఆర్‌, హరీశ్‌.. ఇప్పుడు నీతులు వల్లిస్తున్నారని విమర్శించారు. సెంటిమెంట్‌ రగిలించేందుకు బనకచర్ల అంశాన్ని ఉపయోగించుకునే నీచ ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బనకచర్ల ప్రాజెక్టును ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని.. దీనిపై సీఎం, నీటిపారుదల శాఖ మంత్రి కేంద్రానికి ఇప్పటికే ఫిర్యాదు చేశారని ఆయన చెప్పారు. బ్లాక్‌మెయిల్‌ పైసల దందాలో అరెస్టయిన కౌశిక్‌రెడ్డికి మద్దతు పలకడానికి కేటీఆర్‌, హరీశ్‌లు సిగ్గు పడాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ విమర్శించారు. గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. తమ ఎమ్మెల్యే బ్లాక్‌ మెయిలర్‌ అని హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రజలు బాధ పడుతున్నారన్నారు. కాగా, మహాత్మా జ్యోతిరావు ఫూలే సినిమాకు పన్ను మినహాయింపు కల్పిం చి రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్కూళ్లలో ప్రదర్శించేందుకు ఏర్పా ట్లు చేయాలంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. రాజీవ్‌గాంధీ పంచాయతీ రాజ్‌ సంఘటన్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం గాంధీభవన్‌లో జరగనుందని ఆ సంఘటన్‌ రాష్ట్ర చైర్మన్‌ రాచమల్ల సిద్ధేశ్వర్‌ తెలిపారు. కాగా, రాష్ట్ర మంత్రివర్గంలో తనకు అవకాశం కల్పించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పరిగి ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశా రు. ఢిల్లీలో ఖర్గేతో ఆయన భేటీ అయ్యారు.


ప్రజాపాలనలో ప్రజలంతా ఖుషీ: నిర్మలా జగ్గారెడ్డి

ప్రజా పాలనలో తమకు మేలు జరుగుతోందని ప్రజలంతా సంతోషంగా ఉన్నారని రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ చైర్మన్‌ నిర్మలా జగ్గారెడ్డి అన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుని ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారని కొనియాడారు. గాంధీభవన్‌లో ‘ప్రజా ప్రతినిధులతో ముఖాముఖి’లో భాగంగా అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ పోడెం వీరయ్యతో కలిసి ఆమె ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, ఉద్యోగ బదిలీలపై పలు ఫిర్యాదులు అందాయని.. సంబంధిత శాఖలకు వాటిని నివేదించి పరిష్కృతమయ్యేలా కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని చెప్పారు. ప్రజాపాలనలో తమను భాగస్వాములు చేసినందుకు సీఎం రేవంత్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.


ఇవి కూడా చదవండి..

9వ రోజు కొనసాగుతున్న ఇజ్రాయెల్-ఇరాన్ వార్..దౌత్యం ఎప్పుడు

భారత్-పాక్ యుద్ధాన్ని ఆపినందుకు నోబెల్ బహుమతి పొందలేను

For International News And Telugu News

Updated Date - Jun 22 , 2025 | 03:46 AM