Sigachi tragedy: వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది
ABN , Publish Date - Jul 03 , 2025 | 04:49 AM
సిగాచి పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న క్షతగాత్రుల వైద్య ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ అన్నారు.
క్షతగాత్రులకు మెరుగైన చికిత్స
13 మంది ఆచూకీ లభించాల్సి ఉంది
బాధితులను పరామర్శించిన మీనాక్షి నటరాజన్, మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి దామోదర
పటాన్‌చెరు రూరల్/మియాపూర్/హైదరాబాద్, జూలై 13 (ఆంధ్రజ్యోతి): సిగాచి పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న క్షతగాత్రుల వైద్య ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ అన్నారు. బుధవారం పీసీసీ ఆధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్, వైద్యారోగ్య శాఖమంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి ఆమె పాశమైలారంలోని పరిశ్రమ సంఘటన ప్రాంతాన్ని సందర్శించి బాధిత బంధువులతో మాట్లాడారు. అంతకుముందు పటాన్‌చెరులోని ప్రభుత్వ ఆస్పత్రి, ధ్రువ ఆస్పత్రి, మాదీనగూడ ప్రణం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా మీనాక్షి మాట్లాడుతూ.. ఇప్పటికే బాధితులకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం అందించినట్లు తెలిపారు. మహే్‌షకుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి, మంత్రులు ఘటనపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారని, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.
పేలుడు ఘటనను ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తోందని బాధ్యులను వదిలే ప్రసక్తి లేదన్నారు. మంత్రి రాజనర్సింహ మాట్లాడుతూ.. ఇప్పటివరకు 36 మృతదేహాలు లభ్యమయ్యాయని, 13 మంది ఆచూకీ లభించలేదన్నారు. 11 మంది మృతదేహాలను అప్పగించామని, ఎఫ్‌ఎ్‌సఎల్ రిపోర్ట్ వచ్చాక మిగిలిన మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని తెలిపారు. మిగిలిన శిథిలాలు తొలగిస్తే మిగతా 13 మంది ఆచూకీ లభించే అవకాశం ఉందన్నారు. బాధితులను పరామర్శించిన వారిలో శేరిలింగంపల్లి ఎమ్మెలే గాంధీ, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తదితరులున్నారు. కాగా, ప్రమాదంపై విచారణకు ఆదేశించాలని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీ యాజమాన్యానిది తప్పు అని తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఎవరూ రాక.. అనాథల్లా అంత్యక్రియలు

రామచంద్రాపురం టౌన్, జూలై 2 (ఆంధ్రజ్యోతి): పాశమైలారం గ్రామంలో బ్యాచిలర్లుగా ఉంటూ సిగాచి పరిశ్రమలో కార్మికులుగా పనిచేస్తున్న ఇద్దరు ప్రమాదంలో మృతిచెందారు. వారి కోసం ఎవరూ రాకపోవడం, మృతదేహాలు కాలిపోయి మాంసపు ముద్దగా మారడం, కుళ్లిపోయే పరిస్థితి నెలకొనడంతో.. అధికారులు, స్థానికులు కలసి పాశమైలారం శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తిచేశారు.
ఇవి కూడా చదవండి
రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..
పాత పన్ను విధానం ఎంచుకున్న వారికి గుడ్ న్యూస్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి