Share News

Godavari water: మహానగరంలో గోదావరి జలాలు బంద్‌..

ABN , Publish Date - Sep 06 , 2025 | 06:43 AM

ఈ నెల 9, 10తేదీల్లో హైదరాబాద్‌ మహా నగరానికి గోదావరి జలాలు బంద్‌ కానున్నాయి. పలు ప్రాంతాలకు 48 గంటల పాటు నీటి సరఫరాలో అంతరాయం తలెత్తనుంది.

Godavari water: మహానగరంలో గోదావరి జలాలు బంద్‌..

- వాల్వుల మార్పిడి నేపథ్యంలో.. 9, 10 తేదీల్లో పలు ప్రాంతాలకు అంతరాయం

హైదరాబాద్‌ సిటీ: ఈ నెల 9, 10తేదీల్లో హైదరాబాద్‌(Hyderabad) మహా నగరానికి గోదావరి జలాలు బంద్‌ కానున్నాయి. పలు ప్రాంతాలకు 48 గంటల పాటు నీటి సరఫరాలో అంతరాయం తలెత్తనుంది. గోదావరి డ్రింకింగ్‌ వాటర్‌ సప్లయ్‌ పేజ్‌-1 పథకంలో భాగంగా ముర్మూర్‌, మల్లారం, కొండపాక పంపింగ్‌ స్టేషన్లలో 3000 మి.మీ డయా ఎంఎస్‌ పంపింగ్‌ మెయిన్‌పై అమర్చిన 900 మిమీ డయా వాల్వుల మార్పిడి పనులు చేయనున్నారు. ఈ నెల 9న ఉదయం 6 నుంచి బుధవారం ఉదయం 11 గంటల వరకు ఈ పనులు నిర్వహించనున్నారు. దీంతో నీటి సరఫరాలో అంతరాయం కలగనుంది.


అంతరాయం తలెత్తే ప్రాంతాలు

‘‘ఎస్‌ఆర్‌ నగర్‌, సనత్‌నగర్‌, బోరబండ, ఎస్‌పీఆర్‌ హిల్స్‌, ఎర్రగడ్డ, బంజారాహిల్స్‌(Erragadda, Banjara Hills), వెంకట్రావు నగర్‌, ఎల్లారెడ్డిగూడ, సోమాజిగూడ, ఫతేనగర్‌ సెక్షన్లు, జూబ్లీహిల్స్‌(Jubilee Hills) కొంత భాగం, తాటిఖానా కొంత భాగం, కూకట్‌పల్లి, భాగ్యనగర్‌, వివేకానంద నగర్‌, ఎల్లమ్మబండ. మూసాపేట్‌, భారత్‌నగర్‌, మోతీనగర్‌, గాయత్రీనగర్‌, బాబానగర్‌, కేపీహెచ్‌బీ, బాలాజీనగర్‌, హష్మత్‌పేట్‌ సెక్షన్‌, చింతల్‌, సుచిత్ర, జీడిమెట్ల, షాపూర్‌నగర్‌, గజులరామారం, సూరారం. ఆదర్శనగర్‌, భగత్‌సింగ్‌నగర్‌, జగద్గిరిగుట్ట,


ఉషోదయ సెక్షన్‌. అల్వాల్‌, ఫాదర్‌ బాలయ్యనగర్‌, వెంకటాపురం, మాచ్చబోలారం, డిఫెన్స్‌ కాలనీ, వాజ్‌పేయి నగర్‌, యాప్రాల్‌, చాణక్యపురి, గౌతమ్‌నగర్‌. సాయినాథ్‌పురం సెక్షన్‌, మౌలాలి రిజర్వాయర్‌, లాలాపేట్‌ కొంత భాగం, తార్నాకా కొంత భాగం, కాప్రా మున్సిపాలిటీ పరిధిలోని చర్లపల్లి, సాయిబాబానగర్‌, రాధికా సెక్షన్లు, కైలాసగిరి పాత, కొత్త రిజర్వాయర్‌ ప్రాంతాలు.. హౌసింగ్‌ బోర్డు సెక్షన్‌, మల్లాపూర్‌ కొంత భాగం, కొండాపూర్‌, డోయెన్స్‌, మాదాపూర్‌ కొంత భాగం, గచ్చిబౌలి కొంత భాగం, నల్లగండ్ల కొంత భాగం, హఫీజ్‌పేట్‌. మియాపూర్‌ సెక్షన్లు,


city1.2.jpg

పొచారం, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, తూముకుంట, జవహర్‌నగర్‌, దమ్మాయిగూడ, నాగారం సెక్షన్‌, అయ్యప్పకాలనీ రిజర్వాయర్‌ ప్రాంతాలు, నిజాంపేట్‌, బాచుపల్లి, ప్రగతినగర్‌, గండిమైసమ్మ, తెల్లాపూర్‌, బోల్లారం, బౌరాంపేట్‌ సెక్షన్లు.. మెఈఎస్‌, త్రిశూల్‌ లైన్స్‌, గన్‌రాక్‌, హకీంపేట్‌ ఎయిర్‌ఫోర్స్‌, సికింద్రాబాద్‌ కాంటోన్మెంట్‌, ఏఐఐఎంఎ్‌సబీ నగర్‌, అదేవిధంగా గ్రామీణ నీటి సరఫరా (ఆర్‌డబ్ల్యూఎస్‌) ఆఫ్‌టేక్స్‌ పరిధిలోని ఆలేర్‌ (యాదాద్రిభువనగిరి), ఘన్‌పూర్‌ (మేడ్చల్‌/శామీర్‌పేట్‌) ప్రాంతాల్లో నీటి సరఫరా అంతరాయం తలెత్తనుందని, ఆయా ప్రాంతాల వినియోగదారులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలి’’ అని వాటర్‌బోర్డు అధికారులు విజ్ఞప్తి చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రేపు సంపూర్ణ చంద్రగ్రహణం

పదేళ్ల బాలుడికి గుండె పోటు.. తల్లి ఒడిలోనే కన్నుమూత

Read Latest Telangana News and National News

Updated Date - Sep 06 , 2025 | 06:43 AM