Yasoda Hospitals: ఊపిరితిత్తుల కేన్సర్‌తోనే మరణాలు అధికం
ABN , Publish Date - Feb 10 , 2025 | 04:33 AM
ఇతర క్యాన్సర్‌ల కంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణంగానే మరణాలు అధికమని యశోద గ్రూప్ ఆస్పత్రుల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జీ ఎస్ రావు తెలిపారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణంగా ప్రతీ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 18 లక్షల మంది చనిపోతున్నారని వెల్లడించారు.
ప్రపంచవ్యాప్తంగా ఏటా 18 లక్షల మంది మృతి
3వ లేదా 4వ దశలో నిర్ధారణతో వైద్యుల వద్దకు
యశోద గ్రూప్ ఆస్పత్రుల ఎండీ డా. జీఎ్‌సరావు
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): ఇతర క్యాన్సర్‌ల కంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణంగానే మరణాలు అధికమని యశోద గ్రూప్ ఆస్పత్రుల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జీ ఎస్ రావు తెలిపారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణంగా ప్రతీ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 18 లక్షల మంది చనిపోతున్నారని వెల్లడించారు. శని, ఆదివారల్లో యశోద ఆస్పత్రిలో ఆధ్వర్యంలో అంతర్జాతీయ పల్మనాలజీ సదస్సు, లైవ్ వర్క్‌షాప్ ‘బ్రాంకస్ - 2025 నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం సదస్సులో జీఎస్ రావు మాట్లాడుతూ.. ఊపిరితిత్తుల క్యాన్సర్ చాలా ఆలస్యంగా 3 లేదా 4వ దశలలో నిర్ధారణ అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో చాలా ఆలస్యంగా వైద్యులను సంప్రదిస్తున్నారని అన్నారు. మన దేశంలో అన్ని క్యాన్సర్ కేసులలో ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులే దాదాపు 8.5 శాతం ఉన్నాయని వివరించారు. దేశంలో మూడు ప్రధాన క్యాన్సర్ కేసులలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ఒకటి అని చెప్పారు. అనేక ఊపిరితిత్తుల వ్యాధులకు ఉపశమనం కలిగించే బ్రాంకియాల్ థర్మో ప్లాస్టీ, ఇంటర్వెన్షనల్ బ్రాంకోస్కోపిక్ థర్మల్ వెపౌర్ అబ్లేషన్ (బీవీటిఎ)లాంటి అత్యాధునిక వైద్య విధానాలను దక్షిణాదిలో తొలిసారిగా తాము ప్రవేశపెట్టినట్లు ఆయన చెప్పారు.
బ్రాంకియాల్ థర్మో ప్లాస్టీ విధానం ద్వారా ఎందరో రోగులకు శాశ్వత చికిత్స చేశామన్నారు. డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి మాట్లాడుతూ కృత్రిమ మేధస్సు ఆధారిత ముందస్తు ఊపిరితిత్తుల క్యాన్సర్లను గుర్తించే పరికరం, అనేక ఇతర కొత్త సాంకేతిక వైద్య విదానాలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు డాక్టర్. పవన్ గోరుకంటి తెలియజేసారు. ’అంతర్జాతీయ ఇంటర్వెన్షనల్ పల్మోనాలజీ సదస్సు లైవ్ వర్క్‌షా్‌ప’ను దేశంలో వరుసగా నాలుగోసారి యశోద గ్రూప్ ఆస్పత్రి నిర్వహించింది. 60 మంది కంటే ఎక్కువ అంతర్జాతీయ అధ్యాపకులు, 3000 మంది కంటే ఎక్కువ జాతీయ అధ్యాపకులు, 150 కంటే ఎక్కువ మంది పల్మోనాలజీ వైద్యులతో ఈ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సదస్సు కార్యనిర్వహక కార్యదర్శి, పల్మనాలజీ వైద్య నిపుణులు డాక్టర్. హరికిషన్, విదేశీ వైద్యులు ప్రొఫెసర్ ఫెలిక్స్ హెర్త్ - థొరాక్స్ క్లినిక్ (జర్మనీ), ప్రొఫెసర్ కైల్ హోగార్త్-యూనివర్సిటీ ఆఫ్ చికాగో (యూఎ్‌సఏ), డాక్టర్. మైఖేల్ ప్రిట్చెట్ (యూఎ్‌సఏ), డాక్టర్. పల్లవ్ షా (లండన్), డాక్టర్. మునవ్వర్ (లండన్), డాక్టర్. లోరెంజో (ఇటలీ), డాక్టర్. జమాలుల్ (మలేషియా)పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..