GHMC: నిబంధనలు ఉల్లంఘిస్తే భవనాలు సీజ్
ABN , Publish Date - Jun 17 , 2025 | 07:46 AM
అక్రమ నిర్మాణాలు, అనుమతి తీసుకున్న ప్లాన్‌ను ఉల్లంఘిస్తూ నిర్మించే భవనాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని జీహెచ్‌ఎంసీ(GHMC) నిర్ణయించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆయా నిర్మాణాలను సీజ్ చేయాలని కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ సర్క్యులర్ జారీ చేశారు.
- జీహెచ్‌ఎంసీ కఠిన నిర్ణయం
- హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో విధి విధానాలు జారీ
హైదరాబాద్ సిటీ: అక్రమ నిర్మాణాలు, అనుమతి తీసుకున్న ప్లాన్‌ను ఉల్లంఘిస్తూ నిర్మించే భవనాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని జీహెచ్‌ఎంసీ(GHMC) నిర్ణయించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆయా నిర్మాణాలను సీజ్ చేయాలని కమిషనర్ ఆర్‌వీ కర్ణన్(RV Karnan) సర్క్యులర్ జారీ చేశారు. ఇందుకు సంబంధించిన ప్రామాణిక విధి విధానాలు విడుదల చేశారు. గ్రేటర్‌లో అక్రమ/నిబంధనలు ఉల్లంఘిస్తూ చేపడుతోన్న నిర్మాణాల సంఖ్య గణనీయంగా పెరగడాన్ని న్యాయస్థానం ఇటీవల తప్పుబట్టింది. మీరేం చేస్తున్నారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ క్రమంలో అక్రమంగా/తీసుకున్న అనుమతి కంటే అదనంగా నిర్మించిన అంతస్తులను సీజ్ చేసి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. దీంతో జీహెచ్‌ఎంసీ చట్టం 1955, సెక్షన్ 461-ఏ, టీజీ- బీపాస్ నిబంధనల ప్రకారం సంక్రమించిన అధికారుల ప్రకారం భవనాలు సీజ్ చేసే అవకాశముందని సర్క్యులర్‌లో పేర్కొన్నారు. అక్రమ/తీసుకున్న అనుమతిని ఉల్లంఘిస్తూ చేపట్టిన నిర్మాణాల్లో అప్పటికే ఎవరైనా ఉంటే మూడు రోజుల్లో ఖాళీ చేయాలని సూచించాలని తెలిపారు. భవనంలోని ప్రవేశ, బయటకు వెళ్లే దారులు, మెట్లు, లిఫ్టులు, ర్యాంపులనూ ఎర్రటి రంగు రిబ్బన్‌తో మూసి వేయాలన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
గరిష్టానికి చేరుకుని, మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు
‘ధరణి’పై ఫోరెన్సిక్ ఆడిట్ షురూ
Read Latest Telangana News and National News