Share News

R.V. Karnan: క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య పర్యవేక్షణను బలోపేతం చేయాలి

ABN , Publish Date - Oct 02 , 2025 | 11:30 AM

క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య కార్యక్రమాలు ప్రభావవంతంగా జరిగేలా పర్యవేక్షణను బలోపేతం చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌.వి.కర్ణన్‌ అధికారులను ఆదేశించారు. ఖైరతాబాద్‌ జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో పారిశుద్ధ్య కార్యక్రమాల అమలుపై కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌ అపూర్వ చౌహాన్‌, ఏసీ శానిటేషన్‌ రఘు ప్రసాద్‌తో సమీక్ష నిర్వహించారు.

R.V. Karnan: క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య పర్యవేక్షణను బలోపేతం చేయాలి

- జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌.వి.కర్ణన్‌

హైదరాబాద్‌ సిటీ: క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య కార్యక్రమాలు ప్రభావవంతంగా జరిగేలా పర్యవేక్షణను బలోపేతం చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌.వి.కర్ణన్‌(GHMC Commissioner R.V. Karnan) అధికారులను ఆదేశించారు. ఖైరతాబాద్‌ జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో పారిశుద్ధ్య కార్యక్రమాల అమలుపై కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌ అపూర్వ చౌహాన్‌, ఏసీ శానిటేషన్‌ రఘు ప్రసాద్‌తో సమీక్ష నిర్వహించారు. ప్రైమరీ కలెక్షన్‌లో ఉన్న లోటుపాట్లు, జీవీపీ క్లియరెన్స్‌, అదనపు బిన్ల ఏర్పాటు, చెత్త సేకరణలో ఉన్న సమస్యలపై చర్చించారు.


city6.2.jpg

ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ నగరంలో శానిటేషన్‌ కార్యక్రమాలు ప్రభావవంతంగా చేపట్టేందుకు అధికారులు పర్యవేక్షణ పెంచాలన్నారు. చెత్త సేకరణ వాహనాలపై పర్యవేక్షణ ఉండాలని, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి చేసిన పనులను పరిశీలించి, ప్రతిపాదిత నిర్మాణాత్మక పరిష్కారాలను కమిషనర్‌ సమీక్షించారు. నగరంలో స్వచ్ఛత కార్యక్రమాలు మరింత మెరుగుపడాలని, జవాబుదారీతనం, సమయానుకూల చర్యలు, పర్యవేక్షణ పెంచాలని అధికారులను ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం ధర తగ్గేదేలే.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

టాప్ ప్లేస్‌లో అంబానీ.. దేశంలో అత్యంత సంపన్నులు వీరే..

Read Latest Telangana News and National News

Updated Date - Oct 02 , 2025 | 11:30 AM