Gandhi Hospital: గాంధీలో అందుబాటులో ఏడు ఎక్స్‌రే యంత్రాలు
ABN , Publish Date - Aug 13 , 2025 | 04:33 AM
గాంధీలో తొమ్మిది ఎక్స్‌రే యంత్రాల్లో ఏడు అందుబాటులో ఉన్నాయని, ఈ నెలాఖారు నాటికి మరో రెండు యంత్రాలను ఏర్పాటు చేస్తామని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ పేర్కొన్నారు.
ఈ నెలాఖారుకు మరో రెండు ఏర్పాటు
‘గాంధీలో ఎక్స్‌రే రంధీ’పై వైద్యాధికారుల స్పందన
అడ్డగుట్ట, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): గాంధీలో తొమ్మిది ఎక్స్‌రే యంత్రాల్లో ఏడు అందుబాటులో ఉన్నాయని, ఈ నెలాఖారు నాటికి మరో రెండు యంత్రాలను ఏర్పాటు చేస్తామని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ పేర్కొన్నారు. ‘గాంధీలో ఎక్స్‌రే రంధీ’ అనే శీర్షికతో ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనానంపై ఆయన స్పందించారు. ఎక్స్‌రే యంత్రాల పనితీరు కారణంగా రోగులకు ఎలాంటి ఇబ్బందులు ఉత్పన్నం కావడం లేదని, ఒక రేడియాలజీ యంత్రాన్ని గచ్చిబౌలి టిమ్స్ నుంచి తీసుకొచ్చారని, దానిని ఏర్పాటు చేసే పని జరుగుతోందని తెలిపారు. ఇటీవల ప్రభుత్వం కొనుగోలు చేసిన యంత్రాల ఏర్పాటు ప్రక్రియ 22వ తేదీ నాటికి పూర్తవుతుందని చెప్పారు. స్మార్ట్‌ఫోన్ ఆన్ ట్యూన్ నివేదికలను తక్షణ చికిత్స, ప్రణాళిక కోసం ఏర్పాటు చేశామన్నారు. స్టాటిక్ ఫిల్మ్ అవసరం ఉన్న చోట, రోగుల వద్ద మొబైల్ ఫోన్లు లేకపోతే ఎక్స్‌రే ఫిల్మ్‌లను అందిస్తారన్నారు.
మరమ్మతులకు గ్రీన్ సిగ్నల్
‘గాంధీ ఆస్పత్రిలో ఎక్స్‌రే రంధీ’ అనే శీర్శిక ఆంధ్రజ్యోతిలో ప్రచురితం కావడంతో మంగళవారం ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆడ్మినిస్ట్రేషన్ అధికారులు, రేడియాలజీ విభాగం వైద్యులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం మధ్యాహ్నం రేడియాలాజీలోని పాడైపోయిన యంత్రాలను మరమ్మతు చేయడానికి ఓ టెక్నిషియన్ ఆస్పత్రికి చేరుకని పరిశీలించారు. రెండు మూడు రోజుల్లో రెండు మినహా ఎనిమిది ఎక్స్‌రే యంత్రాల్లో కంపెనీ గ్యారంటీలో ఉన్న ఎక్స్‌రే యంత్రాలను బాగుచేయనున్నట్లు తెలిసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
బీసీ గర్జన సభను మరోసారి వాయిదా వేసిన బీఆర్ఎస్
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు
Read Latest Telangana News And Telugu News