Share News

Homosexuality:స్నేహం.. స్వలింగ సంపర్కం.. ఆపై హత్య చేసి బాడీ ముక్కలు ముక్కలు!

ABN , Publish Date - Oct 10 , 2025 | 05:28 PM

ఖమ్మం జిల్లాకు చెందిన అశోక్‌కి వెంకటేశ్వర్లుతో అనుకోకుండా పరిచయం అయింది. మాటామాట కలవడంతో ఆపై ఇద్దరి మధ్య స్నేహం బలపడింది.తామిద్దరం స్వలింగ సంపర్కులమని తెలియడంతో వీరిద్దరూ అశ్లీల కార్యకలాపాలు కొనసాగించారు. అయితే వీరిద్దరూ కలిసినప్పుడల్లా వెంకటేశ్వర్లు కొంత డబ్బు ఇవ్వగా.. అతని వద్ద బాగా డబ్బులున్నాయని అశోక్ గ్రహించాడు.ఏదో ఒకటి చేసి డబ్బులన్నీ లాక్కోవాలని.. ఏం చేయాలనీ ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

 Homosexuality:స్నేహం.. స్వలింగ సంపర్కం.. ఆపై హత్య చేసి బాడీ ముక్కలు ముక్కలు!
Homosexuality

హైదరాబాద్, అక్టోబర్ 10: రాష్ట్రంలో రోజురోజుకీ నేరాలు పెరిగిపోతున్నాయి. లైంగిక వేధింపులు, హత్యలు, అత్యాచారాలు, ప్రమాదాలు ఇలా నిత్యం ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. కొన్ని హత్యాచార ఘటనల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తుంటాయి. అలాంటి ఘటనే మరొకటి జరిగింది. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో జరిగిన ఈ ఘటన అందర్నీ షాక్ కు గురిచేస్తుంది. ఈ కేసులో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. ఈ దారుణానికి సంబంధించి వివరాలు ఇప్పుడు చూద్దాం.


ఖమ్మం జిల్లాకు చెందిన అశోక్‌కి వెంకటేశ్వర్లుతో అనుకోకుండా పరిచయం అయింది. మాటామాట కలవడంతో ఆపై ఇద్దరి మధ్య స్నేహం బలపడింది.తామిద్దరం స్వలింగ సంపర్కులమని తెలియడంతో వీరిద్దరూ అశ్లీల కార్యకలాపాలు కొనసాగించారు. అయితే వీరిద్దరూ కలిసినప్పుడల్లా వెంకటేశ్వర్లు కొంత డబ్బు ఇవ్వగా.. అతని వద్ద బాగా డబ్బులున్నాయని అశోక్ గ్రహించాడు.ఏదో ఒకటి చేసి డబ్బులన్నీ లాక్కోవాలని.. ఏం చేయాలనీ ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. దీంతో అతడ్ని హత్య చేసి మొత్తం డబ్బు లాక్కుందామని మరో ఫ్రెండ్ కృష్ణయ్యతో అశోక్ పథకం వేశాడు.


అనుకున్నట్టుగానే అవకాశం కోసం వీరిద్దరూ ఎదురు చూశారు. గత నెల 16న వెంకటేశ్వర్లు నిద్రలో ఉంగా.. అశోక్, కృష్ణయ్య ఇద్దరూ కలిసి వెంకటేశ్వర్లు తల నరికి చంపి, శరీరం ముక్కలు ముక్కలు చేశారు. శరీర భాగాలను కవర్లలో వేసి పలు చోట్ల పారేశారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా వెంకటేశ్వర్లును దారుణంగా హత్య చేశారు. ఇద్దరు నిందితులకు నగ్మా అనే మహిళ సహాయం చేయడం.. ఈ కేసును మరో కోణంలో ఆలోచింపజేస్తుంది. ఈ నగ్మా ఎవరు? నిందితులకు ఈమెకు ఏమిటి సంబంధం? వీరికి సహాయం ఎందుకు చేసింది? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. హత్య చేసిన తర్వాత వెంకటేశ్వర్లు వద్దనున్న 3 తులాల బంగారం తీసుకొని.. అతని ఫోన్‌లోని ఫోన్ పే నుంచి నిందితులు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారు.


ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. తొలుత మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. తల, చేతులు లభించడంతో మర్డర్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. ఫోన్ పే నుంచి డబ్బులు బదిలీ అవ్వడం గ్రహించి అశోక్‌ని అరెస్ట్ చేయగా నిందితుడు నేరం అంగీకరించాడు.ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. పలు ఆధారాలను సేకరించి.. నిజానిజాలు వెల్లడించనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Viral Video: కొట్టినా చావలేదని.. పామును నోటితో కొరికాడు

EAGLE Operation: కట్టలుకట్టలుగా డబ్బు స్వాధీనం.. ఈగల్ ఆపరేషన్ సక్సెస్

Updated Date - Oct 10 , 2025 | 09:58 PM