Viral Video: కొట్టినా చావలేదని.. పామును నోటితో కొరికాడు
ABN , Publish Date - Oct 10 , 2025 | 05:07 PM
జోగులాంబ గద్వాల జిల్లా మానపాడు మండలం మానోపాడు రైల్వేస్టేషన్ విద్యుత్ సబ్ స్టేషన్‌లో వింత ఘటన చోటు చేసుకుంది. విద్యుత్ సబ్ స్టేషన్‌లో పాము చొరబడిందని పాములు పట్టే స్థానిక వ్యక్తి రాముడుకు కార్యాలయ సిబ్బంది సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న రాములు చాకచక్యంగా 10 నిమిషాల్లోనే పామును పట్టేశాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
కొందరు పామును చూస్తేనే ఎంతో భయపడిపోతుంటారు.. అలాంటిది ఓ వ్యక్తి పామును నోట్లో పెట్టుకున్నాడు. అంతేకాదు పామును మూడు సార్లు కొరికేసి బయపటపడేశాడు. ఈ వింత ఘటన తెలంగాణలో జరిగింది. జోగులాంబ గద్వాల జిల్లా మానపాడు మండలం మానోపాడు రైల్వేస్టేషన్ విద్యుత్ సబ్ స్టేషన్‌లో వింత ఘటన చోటు చేసుకుంది. విద్యుత్ సబ్ స్టేషన్‌లో పాము చొరబడిందని పాములు పట్టే స్థానిక వ్యక్తి రాముడుకు కార్యాలయ సిబ్బంది సమాచారం అందించారు.
అక్కడికి చేరుకున్న రాములు చాకచక్యంగా 10 నిమిషాల్లోనే పామును పట్టేశాడు. ఎత కొట్టినా చనిపోకపోవడంతో రెండు, మూడుసార్లు పామును కొరికేసి పక్కకు పడేశాడు. ఇది చూసిన స్థానికలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే పాములు పట్టే వ్యక్తి రాముడు తనకేమీ కాదని.. అందులో విషం ఉండదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రాముడు ఏ హానీ లేకుండా క్షేమంగానే ఉన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
Bhatti Vikramarka: హైదరాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది..
R Krishnayya on BC reservations: దేశ చరిత్రలో ఇదే తొలిసారి.. హైకోర్టు స్టేపై ఆర్.కృష్ణయ్య మండిపాటు..