Share News

Konda Lakshma Reddy: మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి కన్నుమూత

ABN , Publish Date - Oct 13 , 2025 | 11:14 AM

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి(84) కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున ఉదయం 5.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. నగరంలోని మహా ప్రస్థానంలో మధ్యాహ్నం 3 గంటలకు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయని కుటుంబసభ్యులు తెలిపారు.

Konda Lakshma Reddy: మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి కన్నుమూత
Konda Lakshma Reddy

హైదరాబాద్, అక్టోబర్ 13: తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర విషాదం నెలకొంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి(84) కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున ఉదయం 5.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. నగరంలోని మహా ప్రస్థానంలో మధ్యాహ్నం 3 గంటలకు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయని కుటుంబసభ్యులు తెలిపారు. ఈయన కాంగ్రెస్ లో వివిధ హోదాల్లో పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీసీసీ ప్రతినిధి, గ్రీవెన్స్ సెల్ ఛైర్మన్‌తో పాటు పలు కీలక బాధ్యతలను లక్ష్మారెడ్డి నిర్వర్తించారు. 1999, 2014లో హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఓటమి పాలయ్యారు.


జర్నలిజం పట్ల మక్కువతో లక్ష్మారెడ్డి 1980లో స్థానిక వార్తా సంస్థ NSSను మొదలుపెట్టారు. జూబ్లీహిల్స్ జర్నలిస్ట్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ, ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అధ్యక్షుడిగా కూడా ఆయన సేవలందించారు. ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేపిన కొండా వెంకట రంగారెడ్డి మనవడు లక్ష్మారెడ్డి కావడం గమనార్హం. ఆయన మరణ వార్త తెలిసిన తెలుగు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, రాజకీయ నేతలు సంతాపం ప్రకటిస్తున్నారు.


చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మా రెడ్డి మృతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఎన్ఎస్ఎస్ వార్తా ఏజెన్సీ స్థాపకుడిగా, ఎమ్మెల్యేగా, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా, జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ప్రెసిడెంట్ గా ఆయన సేవలందించారని కొనియాడారు. లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులకు సీఎం సానుభూతి తెలియజేశారు.


ఇవి కూడా చదవండి:

Jubilee Hills Bypoll: కాకరేపుతున్న బైపోల్.. బీజేపీ అభ్యర్థి ఫిక్స్!

BRS Targets Jubilee Hills: టార్గెట్ జూబ్లీహిల్స్.. బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశానికి రంగం సిద్ధం

Updated Date - Oct 13 , 2025 | 11:33 AM