Water Scarcity: పంటలు ఎండుతున్నాయ్.. నీళ్లివ్వండి
ABN , Publish Date - Mar 10 , 2025 | 04:50 AM
వేసవి తీవ్రత ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభం కాక ముందే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రైతులు నీటి కొరతతో ఆందోళన చెందుతున్నారు. పంటలు ఎండిపోతుండడంతో కన్నీరు పెట్టుకుంటున్నారు.
పలు జిల్లాల్లో రైతుల ఆందోళనలు
మునగాల రూరల్/సంస్థాన్‌నారాయణపురం/మోటకొండూరు, ఖమ్మం, గంగాధర, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): వేసవి తీవ్రత ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభం కాక ముందే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రైతులు నీటి కొరతతో ఆందోళన చెందుతున్నారు. పంటలు ఎండిపోతుండడంతో కన్నీరు పెట్టుకుంటున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సాగు నీటిని అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రి గ్రామానికి చెందిన కౌలు రైతు బట్టిపల్లి సుందరయ్య సాగు నీటి కోసం వినూత్న రీతిలో నిరసన తెలిపాడు. ఎస్సారెస్పీ నీరు రాక పొట్ట దశకు వచ్చిన పైరు ఎండిపోతుందని.. పొలంలో ద్విచక్రవాహనంపై ఆదివారం చక్కర్లు కొట్టి ప్రభుత్వానికి తన నిరసన తెలియజేశాడు.
జిల్లాలోని మోతె, మునగాల మండలాల్లోనూ సాగు నీటి సమస్య ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌నారాయణపురం మండలంలోనూ రైతులు ట్యాంకర్ల ద్వారా పొలానికి నీరు పెట్టి పంటను కాపాడుకుంటున్నారు. ఇక, ఖమ్మం జిల్లాలోని కొణిజర్ల, వైరా, ఏన్కూరు తదితర మండలాల్లోని ఎగువ భూములకు నీరందడం లేదంటూ వైరా మేజర్ ఆయకట్టు రైతులు బోనకల్ బ్రాంచి కెనాల్ కాల్వ వైరా మేజర్‌కు వెళ్లే తూము వద్ద ఆదివారం ఆందోళన చేశారు. మరోపక్క, సాగు నీటి సమస్యతో చొప్పదండి ఎమ్మెల్యే మేడపల్లి సత్యంకు ఆదివారం నిరసన సెగ తగిలింది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాలకు వచ్చిన ఎమ్మెల్యే సత్యంను సాగు నీటి కోసం రైతులు నిలదీశారు. రైతు బంధు, రుణమాఫీ ఎక్కడంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఎండిన పంటలను పరిశీలించి నీరు అందేలా చర్యలు తీసుకుంటానన్నారు.
ఇవి కూడా చదవండి
BRS:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ పేరు పరిశీలన..
TG Assembly: 12 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
AICC: కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ఎలా అంటే..
మరిన్ని తెలంగాణ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Read More Latest Telugu News Click Here