Balkampet Temple: బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో నకిలీ టికెట్ల అమ్మకం
ABN , Publish Date - Feb 03 , 2025 | 03:33 AM
బల్కంపేట్ ఎల్లమ్మ దేవాలయంలో నకిలీ టికెట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆలయంలో పని చేసే ఓ ఉద్యోగి గత పదేళ్లుగా నకిలీ టికెట్లను ప్రింట్ చేయించి అమ్ముతూ అడ్డదారిలో డబ్బు సంపాదిస్తున్నట్లు తేలింది.

పదేళ్లుగా కొనసాగుతున్న అక్రమం
టికెట్ కౌంటర్ ఉద్యోగిపై పోలీసులకు ఈవో ఫిర్యాదు
అవినీతిలో పలువురు సిబ్బంది పాత్ర
రూ.లక్షల్లో దండుకున్నట్లు సందేహాలు
అమీర్‌పేట్, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): బల్కంపేట్ ఎల్లమ్మ దేవాలయంలో నకిలీ టికెట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆలయంలో పని చేసే ఓ ఉద్యోగి గత పదేళ్లుగా నకిలీ టికెట్లను ప్రింట్ చేయించి అమ్ముతూ అడ్డదారిలో డబ్బు సంపాదిస్తున్నట్లు తేలింది. జనవరి 12వ తేదీన అధికారులకు ఆలయంలో కొన్ని నకిలీ టికెట్లు దొరికాయి. వాటి గురించి ఆరా తీయగా దేవాలయం టికెట్ కౌంటర్‌లో పని చేస్తున్న శ్రీహరి వాటిని అమ్మినట్లు వెల్లడైంది. ఆ ఒక్క రోజే నకిలీ టికెట్ల ద్వారా సుమారు రూ.31 వేలు వసూలైనట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేయాల్సిన సూపరింటెండెంట్.. ప్రింటింగ్‌లో పొరపాటు జరిగింది అని చెప్పి చేతులు దులుపుకొన్నారు.
ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అప్రమత్తమైన బల్కంపేట ఆలయం ఈవో.. అంతర్గతంగా విచారణ జరిపారు. శ్రీహరితోపాటు నకిలీ టికెట్ల వ్యవహారంతో సంబంధం ఉన్న ఉద్యోగులపై ఎస్సార్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్నేళ్లుగా కొనసాగుతున్న ఈ దందాలో సిబ్బంది రూ.లక్షల్లో డబ్బులు పంచుకున్నట్లు తెలుస్తోంది. పోలీసుల దర్యాప్తులో పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఇవీ చదవండి:
ఏపీకి కేంద్రం వరాల జల్లు.. కేటాయింపులు అదిరిపోయాయి
కేంద్ర ప్రభుత్వ ఆదాయం, ఖర్చుల పూర్తి వివరాలు ఇవే..
భారీగా తగ్గనున్న ఈ వస్తువుల ధరల
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి