Share News

Commissioner: అందరూ అందుబాటులో ఉండాల్సిందే..

ABN , Publish Date - Feb 13 , 2025 | 07:28 AM

సందర్శన వేళల్లో అధికారులు కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఇలంబరిది(GHMC Commissioner Ilambaridi) ఆదేశాలు జారీ చేశారు.

Commissioner: అందరూ అందుబాటులో ఉండాల్సిందే..

- అధికారులకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆదేశం

హైదరాబాద్‌ సిటీ: సందర్శన వేళల్లో అధికారులు కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఇలంబరిది(GHMC Commissioner Ilambaridi) ఆదేశాలు జారీ చేశారు. వివిధ పనులు, వినతులు ఇచ్చేందుకు పౌరులు వచ్చిన సమయంలో ఉన్నతాధికారులు ఆఫీసుల్లో ఉండడం లేదన్న ఫిర్యాదులు రావడంతో కమిషనర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజావాణి జరిగే రోజు మినహా ఇతర పని దినాల్లో సాయంత్రం 4 నుంచి ఐదు గంటల వరకు అదనపు, జోనల్‌ కమిషనర్లు, విభాగాధిపతులు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: AV Ranganath: హైడ్రాపై దుష్ప్రచారం చేస్తే చర్యలు..


ఇతర పనుల్లో నిమగ్నమై ఉండలేకపోతే ముందుగా ఆ సమాచారం అదనపు కమిషనర్‌ (కో ఆర్డినేషన్‌)కు సమాచారం ఇవ్వాలని, ఏ కారణాల వల్ల ఉండడం లేదో చెప్పాలని సూచించారు. విజిటర్స్‌ మాడ్యూల్‌ను అదనపు, జోనల్‌ కమిషనర్లు, విభాగాధిపతులకూ విస్తరించాలని ఐటీ విభాగాన్ని ఆదేశించారు. ఆయా అధికారుల వద్దకు వస్తున్న సందర్శకులు.. ఎన్ని ఫిర్యాదులు పరిష్కారమయ్యాయనే వివరాలను ప్రతి వారం సమర్పించాలని ఇలంబరిది పేర్కొన్నారు.


city2.2.jpg

కమిషనర్‌ చాంబర్‌ వద్ద ఉండే సిబ్బంది.. 4 నుంచి 5 గంటల మధ్య కలిసేందుకు సందర్శకులకు టోకెన్‌ ఇస్తున్నారు. ఎందుకు కలవాలనుకుంటున్నారు..? సమస్య ఏంటి..? అన్నది నమోదు చేస్తున్నారు. 5 నుంచి 6 గంటల మధ్య ప్రజాప్రతినిధులను కమిషనర్‌ కలుస్తున్నారు.


ఈవార్తను కూడా చదవండి: Caste Survey: వివరాలివ్వని వారికి మళ్లీ కులగణన

ఈవార్తను కూడా చదవండి: 70 రకాల క్యాన్సర్లు ముందే గుర్తించొచ్చు

ఈవార్తను కూడా చదవండి: మేడారంలో ఘనంగా మినీ జాతర

ఈవార్తను కూడా చదవండి: సర్వే అంటూ ఇంట్లోకి చొరబడి దోపిడీ

Read Latest Telangana News and National News

Updated Date - Feb 13 , 2025 | 07:28 AM