Share News

Elite Group for Drugs: రూ.4.2 కోట్ల గంజాయి సీజ్‌

ABN , Publish Date - Aug 06 , 2025 | 05:24 AM

ఒడిసా నుంచి హైదరాబాద్‌ మీదుగా ఉత్తరప్రదేశ్‌కు తరలిస్తున్న 874 కిలోల గంజాయి (హై-గ్రేడ్‌)ని ఎలైట్‌ గ్రూప్‌ ఫర్‌ డ్రగ్స్‌, లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌(ఈగల్‌) సీజ్‌ చేసింది.

Elite Group for Drugs: రూ.4.2 కోట్ల గంజాయి సీజ్‌

  • ఇద్దరి అరెస్టు.. 847 కిలోల గంజాయి స్వాధీనం

హైదరాబాద్‌, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): ఒడిసా నుంచి హైదరాబాద్‌ మీదుగా ఉత్తరప్రదేశ్‌కు తరలిస్తున్న 874 కిలోల గంజాయి (హై-గ్రేడ్‌)ని ఎలైట్‌ గ్రూప్‌ ఫర్‌ డ్రగ్స్‌, లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌(ఈగల్‌) సీజ్‌ చేసింది. దీని విలువ రూ.4.2 కోట్లుగా ఉంటుందని ఈగల్‌ అధికారులు తెలిపారు. ఈగల్‌ ఎస్పీ చెన్నూరు రూపేశ్‌ కథనం ప్రకారం.. ఒడిసాలోని మల్కన్‌గిరి నుంచి పెద్దమొత్తంలో గంజాయి వస్తోందనే సమాచారంతో ఖమ్మం ఆర్‌ఎన్‌సీసీ, ఈగల్‌ బృందాలు మంగళవారం శంషాబాద్‌ సమీపంలోని తొండిపల్లి వద్ద కాపుకాచాయి. ఓ వాహనంలో తరలిస్తున్న 874 కిలోల గంజాయిని సీజ్‌ చేసి.. ఒడిసాలోని మల్కన్‌గిరికి చెందిన ధన, రాజేందర్‌ బజింగ్‌లను అరెస్టు చేశాయి.


సీజ్‌ చేసిన గంజాయి విలువ రూ.4.2 కోట్లుగా ఉంటుంది. నిందితుల నుంచి ఒక బులేరో వాహనం, ఒక తల్వార్‌, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ ముఠాకు చెందిన రమేశ్‌ సుఖ్రీ, జగదీశ్‌కుల్‌దీప్‌, షిబో అలియాస్‌ షిబా, బసు, షఫీలను అరెస్టు చేయాల్సి ఉందని వివరించారు. ఈ ముఠా ఈ ఏడాది మొత్తం 1,450 కిలోల గంజాయిని యూపీకి తరలించిందని అధికారులు వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి

పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఆందోళన

కేసీఆర్ ఇచ్చిన టాస్క్‌ను పూర్తి చేశా.. గువ్వాల బాలరాజు షాకింగ్ కామెంట్స్

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 06 , 2025 | 05:24 AM