Crime Investigation: తల్లీకూతుళ్ల దారుణ హత్య
ABN , Publish Date - Aug 09 , 2025 | 04:15 AM
ఆ ఇంట్లో 60 ఏళ్ల మహిళ, ఆమె తల్లి అయిన 90 ఏళ్ల వృద్ధురాలు మాత్రమే ఉంటున్నారు. ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం పనిమనిషి వచ్చి చూడగా..
తలపై ఇనుపరాడ్లతో కొట్టి చంపిన దుండగులు
జఫర్‌గడ్, ఆగస్ట్టు 8 (ఆంధ్రజ్యోతి): ఆ ఇంట్లో 60 ఏళ్ల మహిళ, ఆమె తల్లి అయిన 90 ఏళ్ల వృద్ధురాలు మాత్రమే ఉంటున్నారు. ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం పనిమనిషి వచ్చి చూడగా.. ఇంట్లో మంచమ్మీద ముఖంపై రక్తపు మరకలతో వృద్ధురాలి మృతదేహం కనిపించింది! ఇంటి బయట చెట్టుకింద తలకు తీవ్రగాయాలైన స్థితిలో వృద్ధురాలి కూతురు విగతజీవిగా పడి ఉంది. జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం తమ్మడపల్లి (ఐ)లో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. హతులు తుమ్మ అన్నమ్మ (90), ఆమె చిన్న్నకుమార్తె గాలి రాణి (60). ఇంట్లో బంగారు గొలుసులు.. హతుల్లో ఒకరి శరీరంపై బంగారు కమ్మలు, గాజులు అలాగే ఉండటంతో భూమి, ఆస్తి కోసం ఎవరైనా ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అన్నమ్మ స్వస్థలం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం నీర్మాల. ఆమె భర్త ఇజాత్‌రెడ్డి 30ఏళ్ల క్రితమే చనిపోయాడు. ఇజాత్‌రెడ్డి-అన్నమ్మకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కూతుళ్లున్నారు. అందరికీ పెళ్లిళ్లయ్యాయి.
కుమారులు బతుకుదెరువు కోసం వేర్వేరు చోట్ల ఉం టున్నారు. అన్నమ్మ రెండో కుమార్తెను తమ్మడపల్లి(ఐ)కి చెందిన గాలి జార్జిరెడ్డికి ఇచ్చి పెళ్లి చేశారు. కొంతకాలానికి ఆమె చనిపోవడంతో చిన్న కూతురు రాణిని జార్జిరెడ్డికిచ్చి పెళ్లి చేశారు. జార్జిరెడ్డి 30 ఏళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. రాణి తనకున్న ఐదెకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ తమ్మడపల్లిలోనే ఉంటోంది. రాణి కూతురు కవితకు పెళ్లయి.. ఏపీలోని కృష్ణాజిల్లా కంచికచర్లలోని అత్తగారింట్లో ఉంటోంది. కాగా నీర్మాలలో ఉంటున్న అన్నమ్మ, చిన్న కూతురు రాణి ఇంటికే వచ్చి ఐదేళ్లుగా అక్కడే ఉంటోంది. అప్పట్నుంచి ఆ ఇంట్లో తల్లీకూతుళ్లే ఉంటున్నారు. గురువారం రాత్రే దుండగలు.. అన్నమ్మ, రాణిని హత్యచేసి ఉంటారని భావిస్తున్నారు.
ఇందిరమ్మ ఇళ్లకు ఆధార్ ఆధారిత చెల్లింపులు!
హైదరాబాద్, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారులకు విడుదల చేసే బిల్లుల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ చెల్లింపులకు ఆధార్ అనుసంధాన ప్రక్రియ(ఆధార్ పేమెంట్ బిల్ సిస్టం) ద్వారా నిర్వహిస్తామని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతం తెలిపారు. విడతల వారిగా విడుదల చేస్తున్న ఈ బిల్లులు సకాలంలో లబ్ధిదారులకు అందేలా చేయటంలో ఈ ప్రక్రియ దోహదపడుతుందని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అవి చూసి షాక్ అయ్యా: బండి సంజయ్
‘బీజేపీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు’
For More AndhraPradesh News And Telugu News