Share News

Rave Party Gang: ఈగల్ టీమ్, పోలీసులు సంయుక్త ఆపరేషన్.. రేవ్ పార్టీ ముఠా గుట్టురట్టు

ABN , Publish Date - Aug 25 , 2025 | 05:55 PM

ఈగల్ టీమ్, గచ్చిబౌలి పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి రేవ్ పార్టీ భగ్నం చేశారు. మాదాపూర్ డీసీపీ వినీత్ దీనికి సంబంధించి వివరాలు వెల్లడించారు. రాజేశ్వరి నిలయం అనే సర్వీస్ అపార్ట్మెంట్‌లో రైడ్ నిర్వహించి..

Rave Party Gang: ఈగల్ టీమ్, పోలీసులు సంయుక్త ఆపరేషన్.. రేవ్ పార్టీ ముఠా గుట్టురట్టు
Rave Party Gang

హైదరాబాద్, ఆగస్టు 25: ఈగల్ టీమ్, గచ్చిబౌలి పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి రేవ్ పార్టీ భగ్నం చేశారు. మాదాపూర్ డీసీపీ వినీత్ దీనికి సంబంధించి మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ రైడ్ కు సంబంధించి డీసీపీ ఏమన్నారంటే, 'రాజేశ్వరి నిలయం అనే సర్వీస్ అపార్ట్మెంట్‌లో రైడ్ నిర్వహించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నాం. అరెస్ట్ అయిన వారిలో డ్రగ్ ఫెడ్లర్లు తేజ, విక్రమ్ తోపాటు, ముగ్గురు వినియోగదారులు నీలిమ, పురుషోత్తం, భార్గవ్ ఉన్నారు. ట్రాన్స్‌పోర్టర్ చందన్ కూడా వీరిలో ఉన్నారు' అని డీసీపీ చెప్పారు.

నిందితుల నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామని, 20 గ్రాముల కొకైన్, 08 ఎక్స్టసీ పిల్స్, మూడు గ్రాముల ఎండీఎంఏ సీజ్ చేశామని డీసీపీ తెలిపారు. ఈ కేసులో బెంగళూరుకు చెందిన రాహుల్, మణిదీప్ ఇద్దరు పరారీలో ఉన్నారని డీసీపీ వెల్లడించారు.


'విక్రమ్, తేజ, నీలిమ డ్రగ్స్ ప్రొక్యూర్ చేసి గోవా, రాజమండ్రిలో రేవ్ పార్టీలు నిర్వహించేవారు. తేజ న్యూ ఇయర్ సందర్భంగా గోవాలో ఒక రేవ్ పార్టీ ఏర్పాటు చేశారు. అందులో నీలిమ కూడా ఉన్నారు. పట్టుబడ్డ నిందితులు ప్రతిసారీ రేవ్ పార్టీకి రాహుల్ వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసేవారు. ఈ కేసులో పట్టుబడ్డ డ్రగ్ ఫెడ్లర్ విక్రమ్.. మల్నాడు రెస్టారెంట్ సూర్యకు స్నేహితుడని' డీసీపీ తెలిపారు.

'ఈ కేసులో మరో నిందితుడు మణిదీప్ డిప్యూటీ తహసీల్దార్ గా పని చేస్తున్నాడు. మణిదీప్ రాజమండ్రిలో నివసిస్తూ అక్కడ, గోవాలో పార్టీలు అరెంజ్ చేస్తున్నాడు. రాజమండ్రిలో మణిదీప్‌కు సొంత ఫాంహౌస్ ఉంది. అక్కడా రేవు పార్టీలు ఏర్పాటు చేశాడు. నీలిమ, తేజకు మణిదీప్ డ్రగ్స్ అలవాటు చేశాడు. విక్రమ్, నీలిమ ఐటీ ఉద్యోగులు. తేజకు క్లౌడ్ కిచెన్ బిజినెస్ ఉంది. బిజినెస్‌లో లాభాలు రాకపోవడంతో రేవ్ పార్టీ అరేంజ్ చేస్తున్నాడు. బెంగళూరుకు చెందిన రాహుల్ కు నైజీరియన్ మైక్ డ్రగ్స్ సప్లయ్ చేశాడు. తేజ డబ్బులు ఇస్తే చందన్ డ్రగ్స్ తీసుకువస్తాడు. బ్లూటో థియాన్ ఇంజెక్షన్ మాటున ఈ డ్రగ్స్ తీసుకువచ్చారని' డీసీపీ వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పోలీసుల నిర్లక్ష్యం.. అనంతబాబు కేసుతో తలనొప్పి

ఫోనే కీలకం.. వారిలో మొదలైన అలజడి..!

For More AP News And Telugu News

Updated Date - Aug 25 , 2025 | 08:01 PM