Share News

Eagle Team: మేధా స్కూల్ కరస్పాండెంట్‌కు 14 రోజుల రిమాండ్.. వెలుగులోకి సంచలన విషయాలు..

ABN , Publish Date - Sep 15 , 2025 | 08:52 PM

డబ్బు సంపాదనే లక్ష్యంగా మత్తు మందును తయారు చేసి విక్రయిస్తున్న మేధ స్కూల్ కరస్పాండెంట్‌ జయప్రకాశ్ గౌడ్‌ను అరెస్ట్ చేసిన ఈగల్ టీమ్ కోర్టులో హాజరుపరిచింది. కోర్టు అతడికి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అతడిని చంచల్‌గుడా జైలుకు తరలించారు.

Eagle Team: మేధా స్కూల్ కరస్పాండెంట్‌కు 14 రోజుల రిమాండ్.. వెలుగులోకి సంచలన విషయాలు..
Telangana drug racket

డబ్బు సంపాదనే లక్ష్యంగా మత్తు మందును తయారు చేసి విక్రయిస్తున్న మేధ స్కూల్ కరస్పాండెంట్‌ జయప్రకాశ్ గౌడ్‌ను అరెస్ట్ చేసిన ఈగల్ టీమ్ కోర్టులో హాజరుపరిచింది. కోర్టు అతడికి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అతడిని చంచల్‌గుడా జైలుకు తరలించారు. కోర్టుకు ఈగల్ టీమ్ సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌లో అనేక సంచలన విషయాలు ఉన్నాయి (Telangana drug racket).


స్కూల్‌ని అడ్డం పెట్టుకొని మత్తుమందు తయారు చేసి విక్రయించానని, స్కూల్లో మత్తుమందు తయారుచేస్తే ఎవరికీ అనుమానం రాదనే ఫ్యాక్టరీ పెట్టానని జయప్రకాశ్ గౌడ్ అంగీకరించాడు (Medha school controversy). గురువారెడ్డి అనే వ్యక్తి దగ్గర్నుంచి ఫార్ములాని కొనుగోలు చేశానని, ఆరు సార్లు మత్తుమందు తయారు చేయడంలో ఫెయిల్ అయ్యానని జయప్రకాశ్ గౌడ్ వెల్లడించాడు. ఏడోసారి సక్సెస్ అయిన తర్వాత కల్లులో మత్తు మందును కలిపి ఇచ్చానని, ఆ డ్రగ్‌తో కిక్కు రావడంతో వినియోగారులు హ్యాపీగా ఫీలయ్యారని చెప్పాడు (Eagle Team action).


రోజుకు కిలో చొప్పున మత్తు మందుని తయారు చేశానని, తయారు చేసిన మొత్తం డ్రగ్‌ను స్కూటీ పైన తీసుకువెళ్లి సప్లై చేశానని జయప్రకాశ్ అంగీకరించాడు (Medha correspondent court). పగటిపూట స్కూల్ తరగతులు నడిపించి రాత్రి మత్తు మందు తయారు చేశానని, మత్తుమందు తయారు చేసే ఫ్లోర్‌లో పిల్లలకు ట్యూషన్లు మాత్రమే చెప్పానని తెలిపాడు. తాను తయారు చేసిన డ్రగ్‌ను మహబూబ్ నగర్‌తో పాటు హైదరాబాదులోని పలు కల్లు కాంపౌండ్లకి సప్లై చేశానని అంగీకరించాడు.


ఈ వార్తలు కూడా చదవండి..

మళ్లీ వార్తల్లో మాజీ ఐఏఎస్ ఫ్యామిలీ

టార్గెట్ జూబ్లీహిల్స్.. రంగంలోకి కేటీఆర్

For TG News And Telugu News

Updated Date - Sep 15 , 2025 | 08:52 PM