Corruption: బెల్లం వ్యాపారి నుంచి 30వేల లంచం డిమాండ్
ABN , Publish Date - Aug 24 , 2025 | 03:16 AM
బెల్లం వ్యాపారం చేస్తున్న మహబూబాబాద్ జిల్లా కేంద్ర వాసి నుంచి రూ.30 వేల లంచం తీసుకుంటున్న డోర్నకల్ సీఐ భూక్య రాజేశ్‌ను శనివారం ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు...
ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన డోర్నకల్ సీఐ
డోర్నకల్, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): బెల్లం వ్యాపారం చేస్తున్న మహబూబాబాద్ జిల్లా కేంద్ర వాసి నుంచి రూ.30 వేల లంచం తీసుకుంటున్న డోర్నకల్ సీఐ భూక్య రాజేశ్‌ను శనివారం ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సదరు వ్యక్తి బొలెరో వాహనంలో బెల్లం తరలిస్తుండగా గత మే నెలలోనూ, ఈ నెల మొదటి వారంలోనూ డోర్నకల్ పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ కేసులో హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకున్న సదరు వ్యక్తికి సీఐ రాజేశ్, ఆయన గన్‌మన్ రవి ఫోన్ చేసి.. తమకు రూ.50 వేలు లంచమివ్వక పోతే వ్యాపారం చేయలేవని బెదిరించాడు. తాను అంత మొత్తం ఇవ్వలేనని, రూ.30 వేలు ఇవ్వగలనని చెప్పాడు. దీంతోపాటు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు శనివారం సాయంత్రం డోర్నకల్‌లోని సీఐ రాజేశ్ ఇంట్లో ఆయనకు, ఆయన గన్‌మన్ రవికి రూ.30 వేల డబ్బు ఇస్తుండగా.. వారిద్దరినీ ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం సీఐ ఇంట్లో జరిపిన సోదాల్లో లెక్క తేలని రూ.1,25,050 నగదు లభ్యమయ్యాయి.
ఇవి కూడా చదవండి..
నిధుల్లో న్యాయబద్ధమైన వాటా మాకివ్వడం లేదు.. కేంద్రంపై స్టాలిన్ విసుర్లు
అది సుప్రీం తీర్పు, నా వ్యక్తిగతం కాదు: హోం మంత్రికి సుదర్శన్ రెడ్డి కౌంటర్
For More National News And Telugu News