Bhumika Reddy: మరణిస్తూ.. మరో ఐదుగురికి ప్రాణదానం!
ABN , Publish Date - Feb 10 , 2025 | 04:51 AM
ఈ నెల 1వ తేదీన హైదరాబాద్‌లో భూమికారెడ్డి ప్రయాణిస్తున్న కారు.. డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకోగా నానక్‌రామ్‌గూడలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించారు.

రోడ్డుప్రమాదంలో గాయపడి బ్రెయిన్‌డెడ్‌కు గురైన యువ డాక్టర్ భూమికారెడ్డి
అవయవాలు దానం చేసి కూతురి కోరిక తీర్చిన తల్లిదండ్రులు..
రాయదుర్గం, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): తాను మరణిస్తూ.. మరో ఐదుగురికి ప్రాణం పోసిందా వైద్యురాలు..! ఒక్కగానొక్క కుమార్తె తమకు దక్కదన్న కొండంత దుఃఖాన్ని దిగమింగుకుని, అవయవాలను దానం చేసి బిడ్డ కోరిక తీర్చారు ఆమె తల్లిదండ్రులు.. ఏపీలోని శ్రీసత్యసాయి అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం తలుపులు మండల నంగివాండ్లపల్లికి చెందిన నంగి నందకుమార్‌రెడ్డి, లోహితల కూతురు భూమికారెడ్డి (24).. ఇటీవలేవైద్య విద్య పూర్తిచేసి హైదరాబాద్ ఎల్బీనగర్‌లోని కామినేని ఆస్పత్రిలో హౌస్ సర్జన్‌గా వైద్య సేవలు అందిస్తోంది. ఈ నెల 1వ తేదీన హైదరాబాద్‌లో భూమికారెడ్డి ప్రయాణిస్తున్న కారు.. డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది.
దీంతో ఆమె తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకోగా నానక్‌రామ్‌గూడలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించారు. చివరికి వారం తర్వాత ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు తేల్చారు. దీంతో గతంలో భూమికారెడ్డి అవయవదానంపై చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకున్న తల్లిదండ్రులు.. ఆమె అవయవాలు దానం చేసేందుకు ముందుకొచ్చారు. వైద్యులు భూమికారెడ్డి నుంచి గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు సేకరించి అవసరమైన వారికి అవయమార్పిడి చేసి ప్రాణాలు కాపాడారు. భూమికారెడ్డి మృతదేహాన్ని అంత్యక్రియల కోసం ఆదివారం రాత్రి స్వగ్రామం నంగివాండ్లపల్లికి తరలించారు. భూమికారెడ్డి త్యాగం చిరస్మరణీయమని కాంటినెంటల్ ఆస్పత్రి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గురు ఎన్ రెడ్డి అన్నారు. భూమికారెడ్డిని, ఆమె తల్లిదండ్రుల ఔదార్యాన్ని సోషల్ మీడియాలో పలువురు ప్రశంసించారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..