Relangi Narasimha Rao: మధురానగర్ కాలనీతో ఎంతో అనుబంధం
ABN , Publish Date - Oct 07 , 2025 | 08:35 AM
మధురానగర్ కాలనీతో తనకు ఎంతో అనుబంధం ఉందని, 45 సంవత్సరాల కాలంలో ఎంతో అభివృద్ధి చెందిందని ప్రముఖ సినీదర్శకుడు రేలంగి నర్సింహా రావు అన్నారు. మధురానగర్ సంక్షేమ సమితి 45వ వార్షికోత్సవం, మహాత్మా గాంధీ 156వ జయంతిని స్థానిక సాగి రామకృష్ణం రాజు కమ్యూనిటీ హాల్లో సోమవారం రాత్రి నిర్వహించారు.
- ప్రముఖ సినీ దర్శకుడు రేలంగి నర్సింహారావు
హైదరాబాద్: మధురానగర్ కాలనీతో తనకు ఎంతో అనుబంధం ఉందని, 45 సంవత్సరాల కాలంలో ఎంతో అభివృద్ధి చెందిందని ప్రముఖ సినీదర్శకుడు రేలంగి నర్సింహా రావు(Relangi Narasimha Rao) అన్నారు. మధురానగర్ సంక్షేమ సమితి 45వ వార్షికోత్సవం, మహాత్మా గాంధీ 156వ జయంతిని స్థానిక సాగి రామకృష్ణం రాజు కమ్యూనిటీ హాల్లో సోమవారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కార్పొరేటర్ దేదీప్య, సమితి ప్రతినిధులతో కలిసి మహాత్మా గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. సమితి వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించారు.

అనేక సేవలను కాలనీ వాసులకు అందుబాటులోకి తెచ్చారని ఆయన అన్నారు. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(Maganti Gopinath), తాను ఈ కాలనీవాసులను కుటుంబసభ్యులుగా భావించే వారమని కార్పొరేటర్ దేదీప్యవిజయ్ అన్నారు. ఈ సందర్భంగా గుంటూరుకు చెందిన ఆరాధన ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ప్రదర్శించిన ‘పాప దొరికింది’ హాస్య నాటిక ఆహూతులను ఆకట్టుకుంది. ఈ వేడుకల్లో సమితి ఇన్‌చార్జి అధ్యక్షుడు మనోహర్‌రావు, ప్రధాన కార్యదర్శి కోడె సాంబశివరావు, కోశాధికారి సుగుణ, సంయుక్త కార్యదర్శి హనుమంతరావు, కాలనీవాసులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి పరుగులు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఆల్మట్టి ఎత్తు తగ్గింపుపై హామీతో రావాలి
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ రాజకీయం
Read Latest Telangana News and National News