Share News

Sangareddy: 42కు చేరిన ‘సిగాచి’ మృతుల సంఖ్య

ABN , Publish Date - Jul 07 , 2025 | 03:04 AM

సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 42కు పెరిగింది. పటాన్‌చెరులోని ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికుడు జితేందర్‌ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు.

Sangareddy: 42కు చేరిన ‘సిగాచి’ మృతుల సంఖ్య

  • ఆస్పత్రిలో కార్మికుడి మృతి

  • డీఎన్‌ఏ పరీక్షల ఆధారంగా ముగ్గురి వివరాల గుర్తింపు

  • ఆచూకీ తెలియని మరో

  • మంది కోసం అన్వేషణ

  • సిగాచి పరిశ్రమకు తాళం

పటాన్‌చెరు/పటాన్‌చెరు రూరల్‌ జూలై 6(ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 42కు పెరిగింది. పటాన్‌చెరులోని ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికుడు జితేందర్‌ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని రసూల్‌పూర్‌కు చెందిన జితేందర్‌ 80శాతానికి పైగా కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరాడు. మరోపక్క, మార్చురీలో గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న రెండు మృతదేహాలకు డీఎన్‌ఏ పరీక్షలు చేసిన వైద్యులు.. మృతులను ఇస్నాపూర్‌కు చెందిన దాసరి రామాంజనేయులు (52), మధ్యప్రదేశ్‌కు చెందిన చికెన్‌సింగ్‌ (49)గా గుర్తించారు. ఆ మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. చికెన్‌సింగ్‌ కుటుంబానికి రూ.లక్ష అందజేసిన అధికారులు మృతదేహాన్ని అంబులెన్స్‌లో మధ్యప్రదేశ్‌కు తరలించారు. అలాగే, ప్రమాదం జరిగిన రోజు నుంచి ఆచూకీ లేకుండా పోయిన మహబూబాబాద్‌కు చెందిన ఎం.అఖిల్‌ అనే కార్మికుడి శరీర అవశేషాలను వైద్యులు డీఎన్‌ఏ పరీక్షల ద్వారా గుర్తించి వాటిని కుటుంబసభ్యులకు అప్పగించారు.


అఖిల్‌ కుటుంబం ఉప్పల్‌లోని కొర్రేముల్‌లో నివాసముంటోంది. మొత్తంగా 42 మంది కార్మికులకు చెందిన మృతదేహాలు, శరీర అవశేషాలను బాధిత కుటుంబాలకు అధికారికంగా అప్పగించారు. మరో 18 మంది క్షతగాత్రులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఘటన జరిగిన నాటి నుంచి ఆచూకీ లేకుండా పోయిన మరో 8 మంది కోసం అన్వేషణ కొనసాగుతోంది. ఘటనాస్థలిలో లభించిన 70కి పైగా నమూనాలను ఇప్పటికే ల్యాబ్‌లకు తరలించగా.. ఇంకా ఏమైనా అవశేషాలు లభిస్తాయేమోనని అధికారులు ఘటనా స్థలిని జల్లెడ పడుతున్నారు. సిగాచి పరిశ్రమ ప్రధాన గేటుకి ఎట్టకేలకు తాళం పడింది. శిథిలాల తొలగింపు కార్యక్రమం దాదాపు పూర్తవ్వగా.. ఇప్పటివరకు తమ వారి ఆచూకీ లభించకపోవడంతో కొన్ని కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. వారంతా పాశమైలారం ఐలా భవనం వద్ద పడిగాపులు పడుతున్నారు.


Also Read:

కేటీఆర్‌కు సామ రామ్మోహన్ రెడ్డి సవాల్..

మోదీ ప్రభుత్వం విద్వేషాలని రెచ్చగొడుతోంది.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్

వందేభారత్‌కు తృటిలో తప్పిన ప్రమాదం..

For More Telangana News And Telugu News

Updated Date - Jul 07 , 2025 | 03:04 AM