Share News

BJP: సారథ్యం.. సందిగ్ధం!

ABN , Publish Date - Feb 07 , 2025 | 04:41 AM

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక మరింత జాప్యమయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలంటున్నాయి. సంస్థాగతంగా అర్హత సాధించినా, ప్రస్తుత పరిస్థితుల్లో ఆలస్యమయ్యే అవకాశం ఉందని పార్టీ ముఖ్యనేతలు అభిప్రాయపడుతున్నారు.

BJP: సారథ్యం.. సందిగ్ధం!

  • కొలిక్కిరాని రాష్ట్ర బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎన్నిక

  • ఇద్దరు కీలక ఆశావహుల పరస్పర ఫిర్యాదులు!

  • జిల్లా అధ్యక్షుల ఎన్నిక వివాదాస్పదం కావడంతో మరింత జాప్యం?

హైదరాబాద్‌, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక మరింత జాప్యమయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలంటున్నాయి. సంస్థాగతంగా అర్హత సాధించినా, ప్రస్తుత పరిస్థితుల్లో ఆలస్యమయ్యే అవకాశం ఉందని పార్టీ ముఖ్యనేతలు అభిప్రాయపడుతున్నారు. సంస్థాగతంగా మొదటి నుంచీ ఉన్నవారికి రాష్ట్ర పార్టీ సారథ్య బాధ్యతలు కట్టబెట్టాలా? లేక కొత్తవారికి అవకాశం ఇవ్వాలా? అనే విషయంపై ఇప్పటికే రెండుసార్లు అంతర్గతంగా అభిప్రాయాలు తీసుకున్నారు. అయినా ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు పలువురు సీనియర్‌ నాయకులు పోటీపడుతున్న సందర్భంలో, ఎవరికి బాధ్యతలు కట్టబెట్టాలనేది అధినాయకత్వానికి సవాల్‌గా మారిందన్న అభిప్రాయం పార్టీవర్గాల్లో వ్యక్తమైంది. దీనికి తోడు ఆశావహుల్లో ఇద్దరు, ముగ్గురు కీలక నేతలు పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడం జాతీయ నాయకత్వానికి కొత్త తలనొప్పి తెచ్చిపెట్టిందని ప్రచారం జరుగుతోంది. నాయకుల పరస్పర ఫిర్యాదులపై జాతీయ నాయకత్వం ఆరా తీస్తోందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఎన్నిక ప్రక్రియ మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని అని పార్టీ నేతల ద్వారా తెలిసింది.


జాప్యానికి ఇవి కూడా కారణాలే!

జిల్లా అధ్యక్షుల ఎన్నిక వ్యవహారం వివాదాస్పదం కావడం కూడా రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక జాప్యానికి కారణమయ్యే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే ప్రకటించిన 19 జిల్లా అధ్యక్షుల ఎన్నికల సందర్భంగా నవ, యువతరానికి పట్టం కట్టినా, సామాజిక న్యాయం పాటించలేదన్న విమర్శలు వచ్చాయి. దీంతో 11 జిల్లాలను పెండింగ్‌లో పెట్టారు. స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో మరో 8 జిల్లాలను కూడా పెండింగ్‌లో పెట్టారు. రాష్ట్రంలో కీలకంగా ఉన్న తమకు ఒక్క జిల్లా అధ్యక్ష పదవి కూడా కేటాయించలేదంటూ యాదవ సామాజికవర్గం నాయకులు ఏకంగా రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఇప్పటికే ప్రకటించిన 19 జిల్లా అధ్యక్ష పదవుల్లో మహిళలకు ఒక్కటీ దక్కలేదు. దీంతో మిగతా 19 జిల్లా అధ్యక్ష పదవుల్లో మహిళలకు ఎన్ని దక్కుతాయనేది కూడా ఉత్కంఠ రేపుతోంది.


ఇవి కూడా చదవండి:


Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..

8th Pay Commission: ప్యూన్ నుంచి ఆఫీసర్ జీతాలు ఎలా పెరుగుతాయంటే.. నెలకు లక్షకుపైగా

RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో

IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 07 , 2025 | 04:41 AM