Share News

Declining number of IPS officers: ఐదేండ్లుగా గణనీయంగా తగ్గుతున్న IASల సంఖ్య.. తెలంగాణ నుంచే..

ABN , Publish Date - Oct 20 , 2025 | 09:53 AM

గత ఐదేండ్ల గణంకాలను పరిశీలిస్తే తెలంగాణ నుంచి ఎంపికవుతున్న IASల సంఖ్య తగ్గుతూ వస్తుంది. 2023-24 లో ట్రైనింగ్ పూర్తి చేసిన ఐపీఎస్ అధికారుల్లో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించే వారు 1 శాతం మాత్రమే ఉండటం గమనార్హం.

Declining number of IPS officers: ఐదేండ్లుగా గణనీయంగా తగ్గుతున్న IASల సంఖ్య.. తెలంగాణ నుంచే..
Declining number of IPS officers

ఇంటర్ నెట్ డెస్క్, అక్టోబర్ 20: కేంద్ర ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వమైనా సర్కార్ ను నడిపించాలంటే.. ఐఏఎస్ లు ముఖ్య పాత్ర పోషిస్తారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి నుంచి జిల్లా కలెక్టర్ వరకు ఇలా ఐఏఎస్ లు పరిపాలన చేస్తుంటారు. ప్రభుత్వం సజావుగా నడవాలంటే.. అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఎలాంటి ఆటంకం లేకుండా త్వరితగతిన పూర్తవ్వాలంటే ఐఏఎస్ లు పరిపాలన చేయాల్సిందే. అయితే దేశంలో తెలంగాణ నుంచి ఐపీఎస్‌కు ఎంపిక అవుతున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం కాస్త ఆందోళన కలిగిస్తుంది. గత ఐదేండ్ల గణంకాలను పరిశీలిస్తే తెలంగాణ నుంచి ఎంపికవుతున్న వారి సంఖ్య తగ్గుతూ వస్తుంది. 2023-24 లో ట్రైనింగ్ పూర్తి చేసిన ఐపీఎస్ అధికారుల్లో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించే వారు 1 శాతం మాత్రమే ఉండటం గమనార్హం. ఇటీవల ఆర్‌ఆర్ ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన 77 మంది అధికారులకు ఫేజ్-1 శిక్షణ పూర్తి అయింది. మొత్తంగా 174 మంది శిక్షణ పూర్తి చేసుకోగా.. రాష్ట్రం నుంచి కేవలం ఇద్దరు మాత్రమే ఎంపికయ్యారు. రాష్ట్రానికి 163 మంది ఐపీఎస్ అధికారులు అవసరం ఉండగా.. ప్రస్తుతం 139 మంది అధికారులు మాత్రమే పరిపాలన చేస్తున్నారు.


సివిల్ సర్వీస్ పరీక్షల్లో ఐపీఎస్‌కు ఎంపికైన అభ్యర్థుల సంఖ్య రాష్ట్రవ్యాప్తంగా తక్కువగా ఉంటుంది. ఐపీఎస్‌లకు అత్యున్నత శిక్షణ ఇచ్చే సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ.. మన రాష్ట్రంలోనే ఉన్నా ఇక్కడి నుంచి ఎంపికయ్యే అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉండటం గమనార్హం. గత ఐదేండ్ల నివేదికల ప్రకారం 73 బ్యాచ్‌లో 4 శాతం ఉండగా.. 74,75,76 బ్యాచ్‌లో 3 శాతానికి పడిపోయారు. 77 బ్యాచ్‌కు వచ్చేసరికి కేవలం ఒక శాతం మాత్రమే నమోదయింది. కేవలంఇద్దరు మాత్రమే ఐఏఎస్ కు అర్హత సాధించి శిక్షణలో ఉన్నారు. అయితే దేశ వ్యాప్తంగా శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్ అధికారులను రాష్ట్రాలకు కేటాయించడం 2 శాతానికి పడిపోయింది. 73, 74 బ్యాచ్‌లలో 3 శాతం కేటాయించగా, 75 బ్యాచ్‌లో 6శాతం ఆలోకేట్ చేశారు. 76, 77 బ్యాచ్‌లలో కేవలం 2 శాతం మాత్రమే కేటాయించగా.. 77 బ్యాచ్‌లో నలుగురు అధికారులను కేటాయించారు.


ఇక ఐఏఎస్ అధికారుల సంఖ్య దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళలో అధికంగా ఉంది. కేరళ నుంచి 77 బ్యాచ్‌లో 5 శాతం మంది అధికారులు ఎంపికయ్యారు. గతేడాదితో పోలిస్తే 2 శాతం మెరుగయ్యారు. ఇక తమిళనాడు నుంచి 7 శాతం ఉన్నారు. కేరళ మాదిరిగానే 2 శాతం పెరిగారు. కేరళ నుంచి 8 మంది, తమిళనాడు నుంచి 12 మంది ఉన్నారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం నుంచి అత్యధికంగా 20 శాతం మంది ట్రైనింగ్‌లో ఉన్నారు. 35 మంది 77వ బ్యాచ్ శిక్షణ పొందారు. తర్వాతి స్థానాల్లో రాజస్థాన్ నుంచి 19, మహరాష్ట్ర 19, ఢిల్లీ నుంచి 17 మంది సెలెక్ట్ అయి ట్రైనింగ్‌లో ఉన్నారు.


ఇవి కూడా చదవండి:

Engineering Colleges: ఇంజినీరింగ్ కళాశాలలు బంద్.. ఎప్పటి నుంచంటే.. ?

Jubilee Hills by-election: ‘జూబ్లీ’ జోరు.. ప్రచార హోరు..

Updated Date - Oct 20 , 2025 | 09:53 AM