Damodara Rajanarsimha: వర్గీకరణ ఎవరికీ వ్యతిరేకం కాదు
ABN , Publish Date - Feb 15 , 2025 | 04:23 AM
ఎస్సీ వర్గీకరణ ఏ ఒక్క కులానికి, మతానికి వ్యతిరేకం కాదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. రిజర్వేషన్ల కేటాయింపు 2011 జనాభా లెక్కల ప్రకారం చేశామని, ఎస్సీ రిజర్వేషన్లపై ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవని స్పష్టం చేశారు.

ఎస్సీ రిజర్వేషన్లపై ఎలాంటి అనుమానాల్లేవు
విపక్షాల ఆరోపణలను కాంగ్రెస్ శ్రేణులు తిప్పికొట్టాలి
పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లో మంత్రి దామోదర
హైదరాబాద్, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ వర్గీకరణ ఏ ఒక్క కులానికి, మతానికి వ్యతిరేకం కాదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. రిజర్వేషన్ల కేటాయింపు 2011 జనాభా లెక్కల ప్రకారం చేశామని, ఎస్సీ రిజర్వేషన్లపై ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవని స్పష్టం చేశారు. విపక్షాలు చేస్తున్న ఆరోపణల ను కాంగ్రెస్ శ్రేణులు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్(పీపీపీ) ద్వారా కాంగ్రెస్ ముఖ్య నాయకులకు మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలతో పాటు ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు, డీసీసీ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన గంట వ్యవధిలోనే శాసనసభలో ప్రకటన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై సుదీర్ఘకాలం పోరాటం చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఎస్సీ వర్గీకరణపై చిత్తశుద్ధితో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసి సీనియ ర్ న్యాయవాదులతో కేసును వాదించామని తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తుందన్నారు. దళితుల్లో అత్యంత వెనుకబడిన కులాలకు సామాజిక న్యాయం చేయడానికి కృషిచేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కాగా, ఎస్సీ వర్గీకరణను స్వాగతిస్తూ 57 ఎంబీఎస్సీ కులాల ఐక్యవేదిక ప్రతినిధులు మంత్రి దామోదరను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తిరుపతి జిల్లా: నారావారిపల్లెలో విషాదం
ప్రభుత్వం నిరుపేదల గురించి ఆలోచించదా..: హరీష్‌రావు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News