Cybercrime: పోలీసింగ్‌కు సైబర్ క్రైం ప్రధాన సవాల్
ABN , Publish Date - Aug 24 , 2025 | 03:11 AM
పోలీసింగ్‌కు పెరుగుతున్న సైబర్ నేరాలు ప్రధాన సవాల్ అని డీజీపీ జితేందర్ తెలిపారు..
ఇండియన్ పోలీస్ సర్వీస్ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో మధ్య అవగాహనా ఒప్పందం
హైదరాబాద్, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): పోలీసింగ్‌కు పెరుగుతున్న సైబర్ నేరాలు ప్రధాన సవాల్ అని డీజీపీ జితేందర్ తెలిపారు. ఇందుకోసం హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎ్‌సబీ)లోని డేటా సైన్స్ ఇనిస్టిట్యూట్, రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ సందర్భంగా డీజీపీ జితేందర్ మాట్లాడుతూ.. ఐఎ్‌సబీ- సైబర్ సెక్యూరిటీ బ్యూరో మధ్య ఒప్పందంతో సైబర్ నేరగాళ్ల నుంచి పౌరులను కాపాడి డిజిటల్ తెలంగాణగా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఈ మేరకు రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ షికా గోయల్ ఓ ప్రకటన చేస్తూ.. సైబర్ నేరాలు, ముఖ్యంగా ఆర్థిక మోసాలను ఎదుర్కొనేందుకు పరిశోధన, సాంకేతికత ఆధారిత సాధనాలు, విధాన ప్రేమ్‌వర్క్‌ల రూపకల్పనలో ఇరు సంస్థలు కలిసి పని చేస్తాయని తెలిపారు. రెండు సంస్థలూ డిజిటల్ మోసాల నివారణ, సైబర్ నేరాల ప్రాసిక్యూషన్‌కు ఫ్రేమ్‌వర్క్ రూపకల్పనతోపాటు ఏఐ ఆధారిత నేరాలపై ముందస్తు చర్యలకు విధి విధానాలను ఖరారు చేస్తాయన్నారు. మ్యూల్ ఖాతాల నెట్‌వర్క్, డిజిటల్ మనీ లాండరింగ్, డీప్ ఫేక్, ఫైనాన్షియల్ మానిప్పులేషన్స్‌పై దృష్టి పెడతారన్నారు.
ఇవి కూడా చదవండి..
నిధుల్లో న్యాయబద్ధమైన వాటా మాకివ్వడం లేదు.. కేంద్రంపై స్టాలిన్ విసుర్లు
అది సుప్రీం తీర్పు, నా వ్యక్తిగతం కాదు: హోం మంత్రికి సుదర్శన్ రెడ్డి కౌంటర్
For More National News And Telugu News