Police website: పనిచేయని పోలీస్ వెబ్‌సైట్...
ABN , Publish Date - Dec 03 , 2025 | 07:06 AM
హైదరాబాద్ నగరంలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వెబ్‌సైట్ పనిచేయడం లేదు. టెక్నికల్ సమస్యలు తెలెత్తిన నేపధ్యంలో వెబ్‌సైట్ పనిచేయడం లేదు. దీనిపై సాంకేతిక నిపుణులతో పోలీస్ కమిషనరేట్ అధికారులు సంప్రదింపులు జరిపి తిరిగి వెబ్‌సైట్ పునరుద్ధరణకు ఏర్పాట్లు చేస్తున్నారు.
- వారం రోజులుగా సమస్య
హైదరాబాద్ సిటీ: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వెబ్‌సైట్(Cyberabad Police Commissionerate website) పని చేయడం లేదు. సాంకేతిక సమస్య తలెత్తిందని పోలీసులు చెబుతున్నారు. వెబ్‌సైట్ నిర్వహణలో తలెత్తిన సమస్యలను నిపుణులు పరిశీలిస్తున్నారని సైబర్ క్రైం డీసీపీ సుధీంద్ర తెలిపారు. ‘వెబ్ (https://cyberabadpolice.gov.in/) బ్రౌజర్ ఓపెన్ చేస్తుంటే గేమింగ్ సైట్‌కు వెళ్తున్నట్లు గుర్తించాం. ఈ సమస్య వారం రోజుల క్రితం ఉత్పన్నమైంది. సమస్య ఎక్కడ ఉందో ఐటీ నిపుణులు గుర్తిస్తున్నారు. పునరుద్ధరణకు వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి’ అని సూచించారు.

ఈ వార్తలు కూడా చదవండి..
పట్టుబట్టి.. మంజూరు చేయించి...
Read Latest Telangana News and National News
