CPS Employees: గత ప్రభుత్వ జీవో 28ను రద్దు చేయాలి
ABN , Publish Date - Aug 24 , 2025 | 04:00 AM
గత ప్రభుత్వం జారీ చేసిన జీవో 28ను రద్దు చేయాలని తెలంగాణ కంట్రిబ్యూటరీ పెన్షన్స్ స్కీం...
సీపీఎస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థిత ప్రజ్ఞ
హైదరాబాద్, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వం జారీ చేసిన జీవో 28ను రద్దు చేయాలని తెలంగాణ కంట్రిబ్యూటరీ పెన్షన్స్ స్కీం(సీపీఎస్) ఎంప్లాయిస్ యూనియన్ డిమాండ్ చేసింది. వందల సంఖ్యలో సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలతో మధ్యాహ్న భోజన విరామ సమయంలో పాఠశాలలు, కార్యాలయాల్లో శనివారం నిరసన చేపట్టారు. సీపీఎస్ నోడల్ ఆఫీస్ కార్యాలయం ముందు జీవో 28 ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థిత ప్రజ్ఞ మాట్లాడుతూ.... తెలంగాణ ఏర్పడ్డ 2 నెలల్లోనే రాష్ట్రంలో 2 లక్షలపైగా ఉన్న సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులను జీవో 28తో మళ్లీ నూతన పెన్షన్ విధానంలోకి నెట్టారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలోను సీపీఎ్‌సను రద్దు చేసి పాత పెన్షన్‌ను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చిన సంగతి గుర్తు చేశారు. మేనిఫెస్టోకనుగుణంగా సీపీఎ్‌సను రద్దు చేసి పాతపెన్షన్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి స్థితప్రజ్ఞ విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి..
నిధుల్లో న్యాయబద్ధమైన వాటా మాకివ్వడం లేదు.. కేంద్రంపై స్టాలిన్ విసుర్లు
అది సుప్రీం తీర్పు, నా వ్యక్తిగతం కాదు: హోం మంత్రికి సుదర్శన్ రెడ్డి కౌంటర్
For More National News And Telugu News