Ibomma Ravi:ఐబొమ్మ రవికి కోర్టు షాక్.. 12 రోజుల పోలీస్ కస్టడీ..
ABN , Publish Date - Dec 16 , 2025 | 07:17 PM
తెలుగు ఇండస్ట్రీకి పైరసీ ద్వారా నష్టం తీసుకువస్తున్నాడని బోడపాటి రవికుమార్ అలియాస్ ఐబొమ్మ రవి పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
తెలుగు సినీ పరిశ్రమకు (Telugu Film Industry) తీవ్ర నష్టం కలిగించేలా, కొత్త చిత్రాలు విడుదలైన వెంటనే ఐబొమ్మ(iBOMMA), బప్పం (Bappam.TV) వంటి 17 వెబ్‌సైట్స్ ద్వారా కోట్లు సంపాదించిన బోడపాటి రవి అలియాస్ ఐబొమ్మ రవి (iBOMMA Ravi) కి కోర్టు షాక్ ఇచ్చింది. ప్రస్తుతం రవి పోలీస్ కస్టడీ ( Police Custody)లో ఉన్నాడు. ఈ మధ్య ఆయన బేయిల్ కోసం పెట్టుకున్న అర్జీని కోర్టు తిరస్కరించింది. కాగా, ఈ పిటీషన్ పై నాంపల్లి కోర్టులో మంగళవారం మరోసారి విచారణ జరిగింది.
ఈ నేపథ్యంలో రవిని 12 రోజుల పాటు పోలీస్ కస్టడీకి తీసుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఒక్కో కేసులో 3 రోజుల పాటు విచారించాలని తెలిపింది. ఈ లెక్కన ఐబొమ్మ రవిపై నాలుగు కేసులు ఉండగా.. మొత్తం 12 రోజుల పాటు విచారించనున్నట్లు తెలుస్తుంది. ఈ నెల 18 నుంచి విచారణ మొదలుకానుంది. ఈ కస్టడీ ద్వారా పోలీసులు ఐబొమ్మ రవికి సంబంధించిన వెబ్‌సైట్ కార్యాకలాపాలను పూర్తిగా ఛేదించి, పైరసీ నెట్‌వర్క్ (Piracy network) ని పూర్తిగా క్లోజ్ చేసే పనిలో ఉన్నారు.
ఈ రోజు (మంగళవారం) నాంపల్లి కోర్టు(Nampally Court)లో కొనసాగిన విచారణలో రవి తరుపు లాయర్ శ్రీనాథ్ తమ వాదనలు వినిపించారు. రవిని రెండు సార్లు కస్టడీకి తీసుకున్నారని.. అతడిని ఇబ్బందులు పెడుతున్నారని కోర్టుకు తెలిపారు. మరోవైపు అతనికి బెయిల్ (Bail)మంజూరు చేస్తే కేసును పక్కదారి పట్టించే అవకాశం ఉందని సైబర్ క్రైమ్ పోలీసు(Cybercrime Police)లు అంటున్నారు. చిత్ర పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాడని.. ఐబొమ్మ రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నవంబర్ 14 అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి...
బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం తేదీలో మార్పు..
యూరియా కొనుగోళ్ల కోసం సరికొత్త యాప్: మంత్రి తుమ్మల