Share News

BJP: అంబేడ్కర్‌ పేరుతో కాంగ్రెస్‌ రాజకీయం..

ABN , Publish Date - Jan 25 , 2025 | 11:04 AM

డా బీఆర్‌ అంబేడ్కర్‌(Dr. BR Ambedkar) పేరుతో కాంగ్రెస్‌ పార్టీ రాజకీయం చేస్తోందని బీజేపీ(BJP) నాయకులు ఆరోపించారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 46, అంబేడ్కర్‌ నగర్‌ బస్తీలో ‘సంవిధాన్‌ గౌరవ్‌ అభియాన్‌’ కార్యక్రమంలో భాగంగా ఆ పార్టీ నాయకులు స్థానికులతో సమావేశమయ్యారు.

BJP: అంబేడ్కర్‌ పేరుతో కాంగ్రెస్‌ రాజకీయం..

- బీజేపీ నాయకుల ఆరోపణ

హైదరాబాద్: డా బీఆర్‌ అంబేడ్కర్‌(Dr. BR Ambedkar) పేరుతో కాంగ్రెస్‌ పార్టీ రాజకీయం చేస్తోందని బీజేపీ(BJP) నాయకులు ఆరోపించారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 46, అంబేడ్కర్‌ నగర్‌ బస్తీలో ‘సంవిధాన్‌ గౌరవ్‌ అభియాన్‌’ కార్యక్రమంలో భాగంగా ఆ పార్టీ నాయకులు స్థానికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ కౌన్సిల్‌ మెంబర్‌ కాడిగారి భోజిరెడ్డి, ఖైరతాబాద్‌ అసెంబ్లీ కన్వీనర్‌ గడ్డం వెంకటస్వామి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌(Congress) పార్టీ కేంద్రలో అధికారంలోకి రావడానికి రాజ్యాంగాన్ని అడ్డుపెట్టుకొని దిగజారుడు రాజకీయాలు చేస్తుందన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Union Minister: రేపు భారత మాతకు మహాహారతి


city8.2.jpg

దేశాన్ని అత్యధిక సార్లు పాలించిన కాంగ్రెస్‌ ఎప్పుడూ అంబేడ్కర్‌ను గౌరవించలేద విమర్శించారు. అంబేడ్కర్‌ ఆశయాలకు అనుగుణంగా ప్రధాని మోదీ బలహీన వర్గాల సంక్షేమం కోసం శ్రమిస్తున్నారని చెప్పారు. జూబ్లీహిల్స్‌ డివిజన్‌ బీజేపీ అధ్యక్షుడు మద్దంగుల శ్రీనివాస్‌, సెంట్రల్‌ జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి నీరజ, లీగల్‌ సెల్‌ కో కన్వీనర్‌ కస్తూరి పాల్గొన్నారు.


ఈవార్తను కూడా చదవండి: మా కుమార్తెలా ఏ అమ్మాయీ మోసపోవొద్దు

ఈవార్తను కూడా చదవండి: మేడిగడ్డలో లోపాలను 2019లోనే గుర్తించాం

ఈవార్తను కూడా చదవండి: ఎవుసంపై కేసీఆర్‌ నజర్‌

ఈవార్తను కూడా చదవండి: Uttam: హరీశ్‌వి దగుల్బాజీ మాటలు

Read Latest Telangana News and National News

Updated Date - Jan 25 , 2025 | 11:04 AM