Share News

క్యాబినెట్‌ విస్తరణలో మాదిగలకు చోటివ్వాలి

ABN , Publish Date - May 29 , 2025 | 03:54 AM

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో మాదిగ సామాజికవర్గానికి అవకాశం ఇవ్వాలని ఆ వర్గానికి చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌కు విజ్ఞప్తి చేశారు.

క్యాబినెట్‌ విస్తరణలో మాదిగలకు చోటివ్వాలి

  • రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌చార్జి మీనాక్షికి మాదిగ ఎమ్మెల్యేల బృందం విజ్ఞప్తి

  • పీసీసీ అబ్జర్వర్ల నివేదికలపై మీనాక్షి సమీక్ష

హైదరాబాద్‌/పంజాగుట్ట/ఖైరతాబాద్‌, మే 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో మాదిగ సామాజికవర్గానికి అవకాశం ఇవ్వాలని ఆ వర్గానికి చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌కు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ లో మానకొండూరు ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్‌, మందుల సామ్యూల్‌ తదితరుల బృందం మీనాక్షితో భేటీ అయి చర్చించింది. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. మాదిగ సామాజిక వర్గానికి మంత్రి పదవి వచ్చాక కాంగ్రెస్‌ పార్టీకి, ప్రభుత్వానికి కృతజ్ఞతగా 25 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. కేసీఆర్‌ హయాంలో మాదిగలకు అన్యాయం జరిగిందని, అందుకే మాదిగలంతా ఏకపక్షంగా కాంగ్రె్‌సకు మద్దతిచ్చారని చెప్పారు. అలాగే, పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా పీసీసీ అబ్జర్వర్లు ఇచ్చిన నివేదికలపై బుధవారం ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మీనాక్షి సమీక్షించారు. పెద్దపల్లి, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, జహీరాబాద్‌, మల్కాజిగిరి మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గాల్లో సమస్యలపై పార్టీ ఎమ్మెల్యేలతో ముఖాముఖి మాట్లాడారు. క్షేత్రస్థాయిలో కేడర్‌ పరిస్థితి ఏమిటి, స్థానిక ఎన్నికలకు వెళితే పార్టీ ఏమేరకు విజయం సాధిస్తుందని ప్రశ్నించారు. పెద్దపల్లిపై సమీక్ష సందర్భంగా ఇటీవల మంత్రి శ్రీధర్‌బాబు, ఎంపీ వంశీకృష్ణ మధ్య ప్రొటోకాల్‌ వివాదం గురించి మీనాక్షి ఆరా తీశారు. మెదక్‌ లోక్‌సభ పరిధిలోని నేతలతోనూ సమావేశమైన మీనాక్షి.. సమస్యలపై చెప్పడం ఇష్టం లేకుంటే.. లేఖ రూపంలో ఇవ్వాలని సూచించారు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి మాట్లాడుతూ.. త్వరలో సీఎం రేవంత్‌ రెడ్డి, పీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌, మీనాక్షి నటరాజన్‌ కూర్చుని అన్నీ సెట్‌ చేస్తారని పేర్కొన్నారు.


మంత్రి పదవి ఇవ్వాల్సిందే

మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్‌ నేత, తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్‌ గజ్జెల కాంతం, రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్‌ మాజీ చైర్మన్‌ పిడమర్తి రవి డిమాండ్‌ చేశారు. దళితుల్లో మాదిగలు 70 శాతం ఉన్నారని, తమ వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని రాహుల్‌ గాంధీని కోరుతున్నామని వారు చెప్పారు. కాగా, మాలలంతా కాంగ్రెస్‌ గెలుపు కోసం కష్టపడ్డారని, అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ మాలలకు అన్యాయం చేస్తోందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య ఆరోపించారు. మాల మహానాడు కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ..మంత్రివర్గ విస్తరణలో మాల వర్గానికి పదవి ఇవ్వాల్సిందేనని అన్నారు.


Also Read:

వావ్.. రైలు పట్టాల మీద జేసీబీ

రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్

తెలంగాణ హైకోర్టు కొత్త సీజే ఎవరంటే

For More Telangana News and Telugu News..

Updated Date - May 30 , 2025 | 03:07 PM